SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
SBI PO Recruitment: 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థుల నుంచి డిసెంబరు 27 నుంచి జనవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

SBI PO Recruitment Notification 2025: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 600 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు డిసెంబరు 27 నుంచి ప్రారంభం కానుంది. కాగా.. దరఖాస్తు గడువు జనవరి 16తో ముగియనుంది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,480 - రూ.85,920 మధ్య జీతభత్యాలు ఉంటాయి.
వివరాలు..
* ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 600 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 87, ఎస్టీ- 57, ఓబీసీ-158, ఈడబ్ల్యూఎస్- 58, యూఆర్- 240.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 01.04.2003 - 02.04.1994 మధ్య జన్మించి ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్-2 మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష విధానం:
మెయిన్ పరీక్ష విధానం:
తెలుగు రాష్ట్రాల్లో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఏపీలో చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్షా కేంద్రాలు: ఏపీలో గుంటూరు/విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్.
జీత భత్యాలు: నెలకు రూ.48,480 - రూ.85,920.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 27.12.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 16.01.2025.
➥ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఫిబ్రవరి 3 లేదా 4 వారం నుంచి.
➥ స్టేజ్ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: 08.03.2025, 15.03.2025
➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 2025లో
➥ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఏప్రిల్ 2వ వారం నుంచి.
➥ స్టేజ్ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: ఏప్రిల్/మే 2025.
➥ మెయిన్ ఎగ్జామ్ పరీక్ష ఫలితాల విడుదల: మే/జూన్ 2025.
➥ ఫేజ్-3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: మే/జూన్ 2025.
➥ ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: మే/జూన్ 2025.
➥ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్ తేదీలు: మే/జూన్ 2025.
➥ తుది ఫలితాల వెల్లడి: మే/జూన్ 2025.
➥ ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ఫిబ్రవరి 2025.
➥ ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహణ: 2025, ఫిబ్రవరి 2025.
ALSO READ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

