![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
T20 WC 2021: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా
బాబర్ ఆజామ్‌ను పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్ హెడేన్ పొగిడాడు. ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లలో ఒకరితో పాక్ జట్టుకు ప్రమాదమని హెచ్చరించాడు.
![T20 WC 2021: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా T20 WC 2021: Matthew Hayden names Indian batter who can pose a threat to Pakistan T20 WC 2021: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా](https://wcstatic.abplive.in/en/prod/wp-content/uploads/2017/09/6742gallery-image-21817113.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్ గొప్ప నాయకుడని ఆ జట్టు బ్యాటింగ్ సలహాదారు మాథ్యూ హెడేన్ అంటున్నాడు. ధోనీ, ఇయాన్ మోర్గాన్‌లా అతడు జట్టును నడిపించగలడని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పాక్ జట్టుకు ముప్పుగా మారగలరని అంచనా వేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు.
'కెప్టెన్, బ్యాటర్‌గా బాబర్ ఆజామ్‌పై కచ్చితంగా అదనపు ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అతడినే అంతా లక్ష్యంగా ఎంచుకుంటారు. త్వరగా అతడిని ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకే బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అతడు తెలివిగా ప్రవర్తించాలి. తన పాత్రకు న్యాయం చేయాలి' అని హెడేన్ అన్నాడు.
ఐపీఎల్ 2021లో ఎంఎస్ ధోనీ, ఇయాన్ మోర్గాన్ తమ జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన తీరు ఆకట్టుకుందని హెడేన్ చెప్పాడు. వారిలాగే బాబర్ ఆజామ్ నడుచుకుంటాడని పేర్కొన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో సమరానికి ముందు అతడి పాత్ర గురించి వివరించాడు. ఇక భారత జట్టులోని కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పాక్‌కు ప్రమాదకరమని వెల్లడించాడు.
'కొద్దో గొప్పో పొట్టి క్రికెట్లో కేఎల్ రాహుల్ ఎదిగిన తీరును గమనించాను. అతడు పాకిస్థాన్‌కు అత్యంత ప్రమాదకరం. ఒక కుర్రాడిగా అతడి ఆటను చూశాను. వన్డే, టీ20 క్రికెట్లో అతడి ఇబ్బందులు, ఆధిపత్యాన్ని వీక్షించాను. రిషభ్ పంత్ ఆటనూ గమనించాను. ప్రత్యర్థిపై విధ్వంసకరంగా విరుచుకుపడటమే కాకుండా ఆటపై అద్భుతమైన దార్శనికత ఉంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్న పట్టుదల అతడిలో ఉంటుంది' అని హెడేన్ చెప్పాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లో భారత్ విజయ దుందుభి మోగించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఇక అక్టోబర్ 24న దాయాది పాకిస్థాన్‌తో సమరానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు పాక్‌పై పొట్టి ప్రపంచకప్‌లో 5-0తో భారత్‌దే పైచేయి.
Also Read: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఏస్ పేసర్.. ఐపీఎల్‌లో ఏ టీంకు ఆడాడంటే?
Also Read: రెండో వార్మప్ మ్యాచ్ కూడా మనదే.. ఆస్ట్రేలియాపై ఏకంగా 9 వికెట్లతో విజయం!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ
Also Read: షాక్..! బీసీసీఐ ఆఫర్ తిరస్కరించిన వీవీఎస్ లక్ష్మణ్.. ఎందుకంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)