James Pattinson Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఏస్ పేసర్.. ఐపీఎల్‌లో ఏ టీంకు ఆడాడంటే?
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయినట్లు ప్రకటించాడు.
ఆస్ట్రేలియా ఏస్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కుటుంబంతో సమయం గడపడం, యువ ఫాస్ట్ బౌలర్లకు సాయపడి, వారిని దేశానికి ఆడేలా చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యాటిన్సన్ ఈ సందర్భంగా తెలిపాడు.
తనకు యాషెస్ బృందంలో జాయిన్ అవ్వాలని ఉన్నప్పటికీ.. పూర్తిగా ఫిట్‌గా లేనప్పుడు గేమ్ ఆడటం సరైనది కాదన్నాడు. దీనిపై చెయిర్ ఆఫ్ నేషనల్ సెలక్షన్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. జేమ్స్ ప్యాటిన్సన్‌కు క్రికెట్‌పై ఉన్న ప్యాషన్, ఎనర్జీ ద్వారా ఆస్ట్రేలియా టీంకు అతను గొప్ప బలంగా మారాడన్నాడు.
జేమ్స్ ప్యాటిన్సన్ 21 టెస్టు మ్యాచ్‌లు, నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు, 15 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. తన ఖాతాలో 81 టెస్టు వికెట్లు, 16 వన్డే వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో ప్యాటిన్సన్ 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. 2020లో ముంబై ఇండియన్స్‌కు ప్యాటిన్సన్ ప్రాతినిధ్యం వహించాడు.
దీంతోపాటు విక్టోరియా టీంకు కూడా జేమ్స్ ప్యాటిన్సన్ 76 ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఆడాడు. ప్యాటిన్సన్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఏకంగా 302 వికెట్లు ఉండటం విశేషం. న్యూజిలాండ్‌తో 2011లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా జేమ్స్ ప్యాటిన్సన్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్సింగ్స్‌లో 27 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో అతనికే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
ఆ తర్వాత భారత్‌తో ఎంసీజీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ప్యాటిన్సన్ ఆరు వికెట్లు తీశాడు. మనదేశంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐదు వికెట్లు తీసిన రికార్డు కూడా ప్యాటిన్సన్‌కు ఉంది. ఈ గ్రౌండ్‌లో ఆ ఫీట్ సాధించిన ఏకైక ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సనే.
ఆ తర్వాత కూడా జేమ్స్ ప్యాటిన్సన్ బంతికి మంచి ప్రదర్శనలు చేసినా... తరచుగా గాయాలపాలు కావడం అతని కెరీర్‌పై ప్రభావం చూపింది. 2020 జనవరిలో సిడ్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచే ప్యాటిన్సన్ ఆస్ట్రేలియా తరఫున ఆడిన చివరి మ్యాచ్. 2013లోనే జేమ్స్ ప్యాటిన్సన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేశారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వెనక్కి వెళ్లిపోయాడు.
Also Read: విజయంతో వరల్డ్ కప్ ఖాతా తెరిచిన టీమిండియా.. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
Also Read: టీ20 ప్రపంచకప్‌లో ముందే ఫైనల్ ఆడేస్తున్న కోహ్లీసేన! ఇప్పటి వరకు పాక్‌పై తిరుగులేని భారత్
Also Read: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!