Ind vs Pak: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ

దాయాదితో మ్యాచులకు భారత్ సంపూర్ణంగా సన్నద్ధమవుతుందని, భారతీయులు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కొంటారని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. పాక్ తరహాలో భారత్‌ సంచలన, భారీ ప్రకటనలు చేయదని స్పష్టం చేశాడు.

FOLLOW US: 

పాకిస్థాన్‌ తరహాలో భారత్‌ ఎప్పుడూ సంచలన, భారీ ప్రకటనలు చేయదని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. దాయాదితో మ్యాచులకు సంపూర్ణంగా సన్నద్ధమవుతుందని పేర్కొన్నాడు. వారితో పొలిస్తే భారతీయులు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కొంటారని వెల్లడించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్‌ 24న భారత్‌, పాక్‌ తలపడుతున్న నేపథ్యంలో వీరూ మాట్లాడాడు. పాక్‌పై భారత ఆధిపత్యానికి కారణాలను వివరించాడు.

Also Read: విజయంతో వరల్డ్ కప్ ఖాతా తెరిచిన టీమిండియా.. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు

'2003, 20211 ప్రపంచకప్‌ల గురించి మాట్లాడాలంటే అప్పుడు మాపై ఒత్తిడి అంతగా లేదు. ఎందుకంటే మేం టోర్నీలో పాక్‌ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాం. మేం అలాంటి వైఖరితో ఆడతాం కాబట్టే విజయాలు అందుకుంటాం. పాక్‌లా మేమెప్పుడూ భారీ, సంచలన ప్రకటనలు ఇవ్వలేదు. పాక్‌లో మాత్రం విపరీతంగా సవాళ్లు చేస్తుంటారు. భారీ డైలాగులు పేలుస్తుంటారు' అని వీరూ అన్నాడు.

Also Read: టీ20 ప్రపంచకప్‌లో ముందే ఫైనల్‌ ఆడేస్తున్న కోహ్లీసేన! ఇప్పటి వరకు పాక్‌పై తిరుగులేని భారత్‌

'మేం వారిలా ప్రకటనలు ఇవ్వం. టీమ్‌ఇండియా మాటలు కాకుండా మెరుగ్గా సన్నద్ధం అవుతుంది. మ్యాచులో ఎలా ఆడాలో ప్రణాళికలు రచించుకుంటుంది. అలా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే' అని వీరూ ఏబీపీ న్యూస్‌కు చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20ల్లో భారత్‌ను పాక్‌ ఓడించగలదని అతడు వివరించాడు.

Also Read: గబ్బర్ అవతారమెత్తిన కింగ్.. నీలో మంచి నటుడున్నాడయ్యా అంటున్న నెటిజన్లు!

'ఈ ఫార్మాట్‌ ప్రకారం చూస్తే పాకిస్థాన్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వారు వన్డేల్లో కన్నా టీ20ల్లో కాస్త బాగానే ఆడతారు.  బాబర్‌ ఆజామ్‌, ఫకర్‌ జమాన్‌, రిజ్వాన్‌, షాహిన్‌ అఫ్రిది వంటి మ్యాచ్‌ విన్నర్లు జట్టులో ఉన్నారు. ఈ పార్మాట్లో ఎవరైనా ఒక్క ఆటగాడు ప్రత్యర్థి జట్టును ఓడించొచ్చు. ఇప్పటి వరకైతే పాకిస్థాన్ ఆ పని చేయలేకపోయింది' అని వీరూ తెలిపాడు.

Also Read: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: India vs Pakistan ICC T20 World Cup T20 World Cup Virender Sehwag India-Pak ind vs pak Head-to-head India vs Pakistan H2H IND Vs PAK T20 Head to Head

సంబంధిత కథనాలు

LSG Vs RR: లక్నోపై రాజస్తాన్ ఘనవిజయం - రెండో స్థానానికి రాయల్స్ - పోటీ ఇవ్వలేకపోయిన సూపర్ జెయింట్స్!

LSG Vs RR: లక్నోపై రాజస్తాన్ ఘనవిజయం - రెండో స్థానానికి రాయల్స్ - పోటీ ఇవ్వలేకపోయిన సూపర్ జెయింట్స్!

LSG Vs RR: సమిష్టిగా రాణించిన రాజస్తాన్ బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకుండా భారీ స్కోరు - లక్నో టార్గెట్ ఎంతంటే?

LSG Vs RR: సమిష్టిగా రాణించిన రాజస్తాన్ బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకుండా భారీ స్కోరు - లక్నో టార్గెట్ ఎంతంటే?

CSK Vs GT Result: టేబుల్ టాప్ దిశగా గుజరాత్ - చెన్నై ఏడు వికెట్లతో ఘనవిజయం!

CSK Vs GT Result: టేబుల్ టాప్ దిశగా గుజరాత్ - చెన్నై ఏడు వికెట్లతో ఘనవిజయం!

LSG Vs RR Toss: టాప్-2 కోసం పోరాటం - టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్తాన్!

LSG Vs RR Toss: టాప్-2 కోసం పోరాటం - టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్తాన్!

CSK Vs GT: దారుణంగా విఫలమైన చెన్నై బ్యాటింగ్ దళం - వికెట్లున్నా షాట్లు కొట్టలేక - గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

CSK Vs GT:  దారుణంగా విఫలమైన చెన్నై బ్యాటింగ్ దళం - వికెట్లున్నా షాట్లు కొట్టలేక - గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!