Steve Smith: స్టీవ్ స్మిత్ మాస్ బ్యాటింగ్ - ఒక్క బాల్‌కు 16 పరుగులు - గణాంకాలు చూస్తే దిమ్మ దిరగాల్సిందే!
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
Steve Smith Big Bash League: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన స్టీవ్ స్మిత్ దేశవాళీ టీ20 లీగ్ బిగ్ బాష్‌లో భీకరంగా ఆడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో భారీగా పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పుడు ఒక్క బంతికి 16 పరుగులు రాబట్టి మళ్లీ సంచలనం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
హోబర్ట్ హరికేన్స్ బౌలర్ జోయెల్ పారిస్ వేసిన బంతిని స్టీవ్ స్మిత్ సిక్సర్ కొట్టాడు. అయితే అది నోబాల్ కావడంతో ఫ్రీ హిట్ లభించింది. ఫ్రీ హిట్ బాల్‌ను పారిస్ వైడ్ వేశాడు. అది వికెట్ కీపర్‌కు కూడా దొరక్కుండా బౌండరీకి వెళ్లడంతో ఐదు పరుగులు వచ్చాయి. తర్వాత ఫ్రీ హిట్ బాల్‌ను స్మిత్ ఫోర్ కొట్టాడు. దీంతో ఒక్క లీగల్ డెలివరీకి స్మిత్ 16 పరుగులు రాబట్టినట్లు అయింది.
బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్న స్టీవ్ స్మిత్ బ్యాట్ మంచి ఫైర్ మీద ఉంది. రెండు వరుస సెంచరీల తర్వాత, స్మిత్ 66 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో స్టీవ్ స్మిత్ 109.33 సగటుతో, 180.22 స్ట్రైక్ రేట్‌తో 328 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 24 సిక్సర్లు, 18 ఫోర్లు వచ్చాయి.
బిగ్ బాష్ లీగ్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో స్టీవ్ స్మిత్ టెస్టులు, వన్డేలతో పాటు, టి20లలో కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయగలనని నిరూపించాడు. అతని బిగ్ బాష్ లీగ్ ప్రదర్శనే దీనికి చక్కటి సాక్ష్యం. సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్ ఈ హాఫ్ సెంచరీకి ముందు వరుసగా రెండు సెంచరీలు చేశాడు.
ఐపీఎల్‌లో ఎవరూ కొనలేదు
విశేషమేమిటంటే అతడిని ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు. అతను చివరిసారిగా ఐపీఎల్ 2021లోనే ఆడాడు. అయితే ఇప్పుడు బిగ్ బాష్ లీగ్‌లో అతని విధ్వంసక బ్యాటింగ్ చూస్తుంటే ఐపీఎల్‌లో అతడిని కొనకుండా జట్లు తప్పు చేశాయని అనిపిస్తోంది. కానీ ఏ జట్టులో అయినా ఎవరైనా గాయపడకపోతారా? వారి స్థానంలో స్మిత్ రాకపోతాడా?
ఇది కేవలం ఐపీఎల్‌కు మాత్రమే కాదు. భారత్‌కు కూడా అలారం బెల్సే. ఎందుకంటే భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో స్టీవ్ స్మిత్ కూడా భాగం. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో అతను కొట్టిన మొదటి సెంచరీ కేవలం 56 బంతుల్లోనే వచ్చింది. 56 బంతుల్లోనే 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడి తన మొదటి సెంచరీని సాధించాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్న స్టీవ్ స్మిత్ అడిలైడ్ స్ట్రైకర్స్‌పై ఈ ఇన్నింగ్స్‌ను ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఇక అతని స్ట్రైక్ రేట్ 180.36గా ఉంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఛేదనకు దిగి 19 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. ఇందులో సిడ్నీ సిక్సర్స్ బౌలర్లు టాడ్ మర్ఫీ, బెన్ ద్వార్షుయిస్ మూడేసి వికెట్లు తీశారు. దీంతో పాటు స్టీవ్ ఒకీఫ్ రెండు వికెట్లు, సీన్ అబాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు.