IPL 2021: శ్రేయస్ అయ్యర్ ఆగయా... ఇక బ్యాట్ మాట్లాడుతుందంటూ ట్వీట్
భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇక త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇక త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ గాయపడ్డాడు. భుజానికి తీవ్ర గాయం కావడంతో లండన్‌లో శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు.
Ready to go out there. Ready to fight. Ready to play ⚔️ Thank you to everyone who’s helped me recover 🙏 Time to let the bat talk now 💪 pic.twitter.com/VNDWS7hilo
— Shreyas Iyer (@ShreyasIyer15) August 11, 2021
ఇక బ్యాట్ మాట్లాడుతుంది..
‘గాయం నుంచి కోలుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక యుద్ధానికి రెడీ. ఆడటానికి సిద్ధం. ఇక రాబోయే కాలంలో బ్యాట్ మాట్లాడుతుంది’ అంటూ తన శ్రేయస్ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు.
AlsoRead: Ind vs Eng, 2021: లార్డ్స్ గెలిచేదెవరు.. ఇంగ్లండ్, టీమిండియా మధ్య నేటి నుంచి రెండో టెస్టు
గాయం నుంచి కోలుకున్న అనంతరం శ్రేయస్ ఫిట్‌నెస్ కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి వెళ్లాడు. అక్కడ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సంపాదించిన శ్రేయస్ తర్వాత నిర్వహించిన మెడికల్, ఫిట్‌నెస్ పరీక్షల్లో విజవంతమయ్యాడు. దీంతో అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టవచ్చని NCA క్లియరెన్స్ ఇచ్చింది. NCA తాజా నిర్ణయంతో శ్రేయస్... త్వరలో దుబాయ్ వేదికగా జరుగనున్న IPLలో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
AlsoRead: Ind vs Eng, 2021: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. గాయంతో టెస్టు సిరీస్ నుంచి పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అవుట్
అయ్యర్ గాయపడటంతో ఈ ఏడాది తొలి సీజన్ IPLకి దిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇప్పుడు అయ్యర్ తిరిగి జట్టులోకి రావడంతో దిల్లీ క్యాపిటల్స్ ఎవరికి కెప్టెన్సీ అప్పగిస్తుందో చూడాలి. సెప్టెంబరు 19 నుంచి IPL-2021 మిగతా సీజన్ దుబాయ్ వేదికగా ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ X చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.