Ind vs Eng, 2021: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. గాయంతో టెస్టు సిరీస్ నుంచి పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అవుట్
టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లిష్ టీంకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు
ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన కుడి కాలి కండరం గాయంతో భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఒక టెస్టు డ్రాగా ముగిసింది. రేపు రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఇంతలో బ్రాడ్ వైదొలగడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు.
నిన్న జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ వేస్తూ బ్రాడ్ కింద పడిపోయాడు. అప్పడే కాలి కండరానికి గాయమైంది. వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. అయినా నొప్పి తగ్గలేదు. దీంతో ఎంఆర్‌ఐ స్కాన్ చేస్తే కండరం చిట్లినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
కొన్ని రోజులు రెస్టు అవసరమన్న వైద్యుల సలహా మేరకు స్టువర్ట్ బ్రాడ్‌కు ఇంగ్లండ్ టీం విశ్రాంతి ఇచ్చింది. బ్రాడ్ స్థానంలో సకీబ్ మహమూద్‌ను తీసుకున్నారు. ఇతను గత నెలలో పాకిస్థాన్‌తో జరిగిన పరిమిత ఓవర్ల హోమ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. మూడు వన్డేల్లో ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు. అతని యావరేజ్ 13.66గా ఉంది. రెండు టీ20ల్లో ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అందుకే ఆయన్ని జట్టులోకి తీసుకున్నారు.
లార్డ్స్ లాంటి గ్రౌండ్‌లో టెస్టు ఆడటమే చాలా స్పెషల్. అలాంటిది ఓ అచీవ్‌మెంట్ టెస్టు అంటే ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది. అయితే అలాంటి ఆనందానికి దూరమయ్యారు బ్రాడ్. తన 150 టెస్టు లార్డ్స్ వేదికగా ఆడబోతున్న టైంలో గాయం ఆయన రికార్డును దూరం చేసింది.
ఇప్పటికే ఆతిథ్య శిబిరంలో బెన్‌స్టోక్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ ఆడటం లేదు. కొందరు గాయాలతో సిరీస్‌కు దూరమైతే... మరికొందరు వ్యక్తిగత కారణాలతో టూర్ నుంచి వైదొలగారు. మానసిక ఆరోగ్య సమస్యలతో స్టోక్స్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. శ్రీలంకతో జరిగిన హోమ్ సిరీస్‌లో గాయపడ్డ వోక్స్‌ను మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు.
ఆల్‌రౌండర్ మొయిన్ అలీని కూడా జట్టులోకి తీసుకున్నారు. అలీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న ‘ది హండ్రెడ్ లీగ్’లో ఆడుతున్నాడు. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగే రెండో టెస్టుకు అతడిని తిరిగి పిలిపించారు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో ఆల్‌రౌండర్ జాబితాలో అలీని తిరిగి జట్టులోకి పిలిపించినట్లు తెలుస్తోంది.
గాయాల బెడద భారత్‌ను కూడా ఇబ్బంది పెడుతోంది. శార్దూల్ ఠాకూర్ గాయం కారణంగా లార్డ్ టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కొహ్లీనే చెప్పాడు.
Also Read:టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీని వెనక్కి నెట్టిన జో రూట్... 10 స్థానాలు ఎగబాకిన బుమ్రా