అన్వేషించండి
Advertisement
Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు బోపన్న జోడీ
Men Doubles Final In Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడి పురుషుల డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Australian Open 2024 Final : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న రోహన్ బోపన్న(Rohan Bopanna) - మాథ్యూ ఎబ్డెన్(Matthew Ebden) జోడి పురుషుల డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో 6-3, 3-6, 7-6తో తేడాతో చైనాకు చెందిన జాంగ్-చెక్‌కి చెందిన మచాక్ జోడిపై విజయం సాధించింది. మూడు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను బోపన్న జోడీ గెలుచుకోగా... రెండో సెట్‌ను చైనా జోడీ గెలుచుకుంది. దీంతో కీలకమైన మూడో సెట్ నిర్ణయాత్మకంగా మారింది. అయితే మూడో సెట్‌లో అద్భుతంగా పుంజుకున్న రోహన్ బోపన్న జోడీ... చివరి వరకూ వీరోచితంగా పోరాడి 7-6తో సెట్‌ను గెలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంతో వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరిన జోడిగా రోహన్ బోపన్న జోడి రికార్డు సృష్టించింది. 2023 US ఓపెన్‌లో కూడా ఈ జోడి ఫైనల్‌కు చేరుకుంది.
మరో ఘనత సాధించిన బోపన్న
ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open)లో భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్నమరో ఫీట్ సాధించాడు. డబుల్స్‌లో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ దక్కిన మరునాడే సంచలన విజయం ఖాతాలో వేసుకున్నాడు. చివరి వరకూ వీరోచితంగా పోరాడి 7-6తో సెట్‌ను గెలిచి తన జోడీ మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్(Australia Open 2024) పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌కు చేరడం ద్వారా43 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోనున్నాడు. ప్రస్తుతం మూడో ర్యాంకులో ఉన్న రోహన్ బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్ చేరడం ద్వారా వచ్చే వారం నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకోవడం ఖాయమైంది. రోహన్ బోపన్న-ఆస్ట్రేలియాకు చెందిన మాధ్యూ ఎబ్డెన్ జోడి టెన్నిస్ డబుల్స్ విభాగంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. అత్యంత లేటు వయసులో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా జోడీ గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టెనీపై వరుస సెట్ల విజయం సాధించి బోపన్న జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ గెలుపుతో బోపన్న 43 ఏళ్ల వయస్సులో ప్రపంచ నెంబర్ వన్‌గా నిలవనున్నాడు. 20 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్ టెన్నీస్‌లో అరంగేట్రం చేసిన ఈ భారత టెన్నీస్ స్టార్ తన కెరీర్‌లో ఇప్పటివరకూ500కుపైగా విజయాలు సాధించాడు. బోపన్న డబుల్స్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు.
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌పై బోపన్న కామెంట్
పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా నిలవడంపై భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తొలిసారి స్పందించాడు. తన కెరీర్‌లో నమ్మశక్యం కానీ రెండు దశాబ్దాలు గడిచిపోయాయని రోహన్ బోపన్న అన్నాడు. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం చాలా అద్భుతంగా ఉందన్నాడు. ఈ ఘనత సాధించినందుకు తనకు చాలా గర్వంగా ఉందని ఈ టెన్నిస్ స్టార్ అన్నాడు. తన కుటుంబానికి, కోచ్, ఫిజియోకు, భారత టెన్నిస్ సమాఖ్యకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి బోపన్న ధన్యవాదులు తెలిపాడు. వారందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement