Rahul Dravid Son : దడదడలాడిస్తున్న రాహుల్ ద్రవిడ్ కొడుకు - ఈ సిక్స్ కొట్టిన స్టైల్ వైరల్
Samit Dravid : భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్నాడు. ఆ కుర్రాడు సిక్స్ కొట్టిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rahul Dravid Son Samit Six Hitting Video Viral : క్రికెట్‌లో సిక్స్‌లు కొట్టే స్టైల్ చూస్తే ఆటగాళ్ల శైలి అర్థమైపోతుంది. క్లాస్‌గా సిక్సులు కొట్టేవాళ్లు మాస్టర్ ప్లేయర్లు అవుతారు. అలాంటి జాబితాలో చేరేందుకు రాహుల్ ద్రవిడ్ కుమారుడు సుమిత్ ద్రవిడ్ కుమారుడు కూడా రెడీ అవుతున్నారు.
కర్ణాటకలో జరుగుతున్న టీ 20 మహారాజా టోర్నమెంట్‌లో ఆడుతున్న సమిత్ ఓ మ్యాచ్ లో అలవోకగా కొడుతున్న సిక్స్ వీడియో వైరల్ అయిపోయింది. అందరూ రాహుల్ ద్రవిడ్ స్టైల్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
నిజానికి సమిత్ ద్రావిడ్ క్రికెట్‌లో అదృష్టాన్ని చాలా రోజులుగా పరీక్షించుకుంటున్నారు. లోకల్ టోర్నీల్లో విరివిగా పాల్గొంటున్నాడు. కానీ లెజెండ్ కుమారుడిగా ఆయన చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగా కొన్ని మంచి షాట్లు ఆడుతున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మల్చలేకపోతున్నాడు. సాదాసీదా ఆటగానిగానే ఉండిపోతున్నాడు. అయితే అతనిలో మంచి ప్రతిభ ఉందని అడపాదపడా ఇలాంటి క్రికెటింగ్ షాట్ల ద్వారా వెలుగులోకి వస్తూనే ఉన్నాడు.
ದ್ರಾವಿಡ್ ಸರ್ ಮಗ ಗುರು ಇವ್ರು..🤯🔥
— Star Sports Kannada (@StarSportsKan) August 16, 2024
ಈ ಸಿಕ್ಸ್ ಗೆ ಒಂದು ಚಪ್ಪಾಳೆ ಬರ್ಲೇಬೇಕು..👏👌
📺 ನೋಡಿರಿ Maharaja Trophy KSCA T20 | ಬೆಂಗಳೂರು vs ಮೈಸೂರು | LIVE NOW #StarSportsKannada ದಲ್ಲಿ#MaharajaTrophyOnStar@maharaja_t20 pic.twitter.com/ROsXMQhtwO
మహారాజా టీ 20 టోర్నీలో సమిత్ ద్రవిడ్ మొదటి మ్యాచ్ లో సిక్సర్‌తో ఆకట్టుకన్నా .. తర్వాత బాల్‌కే ఔట్ అయ్యాడు. సమిత్ ద్రవిడ్ రాణించనప్పటికీ అతడి జట్టు డక్ వర్త్ లూయిస్ పద్దతిలో వవిజయం సాధించింది.
ఇటీవలి కాలం వరకూ టీమిండియా కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ .. ఇప్పుడు పదవి విరమణ చేశారు. ఇప్పుడు తన కుమారుడి కోచింగ్ బాధ్యతలు తీసుకుంటే.. మరో ఏడాదికో.. రెండేళ్లకో జాతీయ జట్టులోకి వచ్చి దడదడలాడిస్తారని కర్ణాటక ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
సమిత్ ద్రావిడ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్. బ్యాటింగ్ ప్రధానంగా తీసుకున్నా బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. ఈ కారణంగా ఆయన కర్ణాటక క్రికెట్‌కు మరో కీలకమైన ఆటగాడు అవుతాడని.. భవిష్యత్‌లో ఇండియన్ టీముకీ ఆడతారని.. ప్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు.
Samit #Dravid is playing U-19 Zonals and what it means is his participation in the KPL might be limited this year which was expected. Hope he plays well in the Zonals and plays U-19 World Cup for India this year. pic.twitter.com/mMXF1Tpey9
— Shri Ganesh (@QuickrOlx) August 12, 2024
రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు.. కుమారుడు కెరీర్‌పై దృష్టి పెడితే.. మరో జూనియర్ రాహుల్.. భారత్‌కు ది వాల్‌గా మారుతాడని.. అప్పుడే జోస్యం చెప్పేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు.