అన్వేషించండి

Pro Kabaddi: వేలంలో పవన్‌కుమార్‌ సత్తా , ప్రొ కబడ్డీ లీగ్‌ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుర్తింపు

Pro Kabaddi: ప్రో కబడ్డీ 10వ సీజన్ త్వరలో జరగనుంది. ఇక ఈ సీజన్ నిమిత్తం సోమవారం నిర్వహించిన వేలంలో భారత కెప్టెన్ పవన్ సెహ్రావత్‌కు భారీ ధర దక్కింది.

దేశంలో ప్రో కబడ్డీ మేనియా ప్రారంభమైంది. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెషన్‌ సెంటర్‌లో జరిగిన వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు  పోటీ పడ్డాయి.  ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పీకేఎల్ సీజన్‌-10 కోసం జరిగిన వేలంలో తెలుగు టైటాన్స్‌ జట్టు అతడిని రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. 2.60 కోట్లతో ప్రో కబడ్డీ లీగ్‌ 10 సీజన్‌ వేలంలో అత్యధిక ధర పలికిన ఇరాన్‌కు చెందిన మొహమ్మద్‌రెజా షాద్‌లూయీ చియానేహ్‌ రికార్డును పవన్‌ బద్దలుకొట్టాడు. సోమవారం జరిగిన వేలంలో షాద్‌లూయూని పుణేరి పల్టన్‌ రూ.2.35 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రికార్డును పవన్‌కుమార్‌ సెహ్రావత్‌ బద్దలుకొట్టి  ప్రో కబడ్డీ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. గత సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ జట్టు పవన్‌ కుమార్ సెహ్రావత్‌ను రూ. 2.26 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈసారి తెలుగు టైటాన్స్‌ అంతకుమించిన మొత్తంతో అతడిని సొంతం చేసుకుంది. ఇరాన్‌ స్టార్‌ మహ్మద్‌రెజా చియానెహ్ (రూ.2.35 కోట్లు) రెండో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 

భారత స్టార్‌ మనీందర్‌ సింగ్‌ను రూ. 2.12 కోట్లకు బెంగాల్‌ వారియర్స్‌ దక్కించుకుంది.  ఫజల్‌ అత్రాచలి (గుజరాత్‌ టైటాన్స్‌, 1.60 కోట్లు), సిద్ధార్థ్‌ దేశాయ్‌ (హరియాణా స్టీలర్స్‌, రూ.కోటి), మీటూ శర్మ (యూ ముంబా, రూ.93 లక్షలు), విజయ్‌ మలిక్‌ (యూపీ యోధాస్‌, రూ.85 లక్షలు), గమాన్‌ (దబంగ్‌ ఢిల్లీ, రూ.85 లక్షలు), చంద్రన్‌ రంజిత్‌ (హరియాణా స్టీలర్స్‌, రూ.62 లక్షలు), రోహిత్‌ గులియా (గుజరాత్‌ టైటాన్స్‌, రూ.58.50 లక్షలు)భారీ ధరలు పలికారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం ప్రక్రియలో 12 జట్లు పాల్గొన్నాయి. 

వేలంలో పాల్గొన్న అన్ని ఫ్రాంచైజీలు ఇరాన్‌ ఆటగాళ్లు ఫజల్‌ అత్రాఛలి, షడోరులను దక్కించుకొనేందుకు పోటీపడ్డాయి. ఏ కేటగిరీ బరిలో వీరంతా ఉన్నారు. అలాగే ఏ కేటగిరీలో హర్యానాకు చెంందిన రోహిత్‌ గులియా, విజరు మాలిక్‌తోపాటు, మణిందర్‌ సింగ్‌(పంజాబ్‌), మంజిత్‌ ఛిల్లర్‌(ఢిల్లీ)ను దక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. సోమవారం గ్రూప్‌ ఏ, బి ఆటగాళ్లు వేలం జరగగా.. మంగళవారం గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ ఆటగాళ్లు వేలం జరిగింది.

 12 ఫ్రాంఛైజీలు మూడు కేటగిరీల్లో 84 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్నాయి. ఇందులో 22 మంది ఆటగాళ్లను ఎలైట్‌ రిటైన్డ్ కేటగిరీ కింద అంటిపెట్టుకున్నాయి. స్టార్‌ ఆటగాళ్లయిన పవన్ సెహ్రావత్, వికాష్ ఖండోలా, సుర్జీత్ సింగ్, సిద్ధార్థ్ దేశాయ్, అభిషేక్ సింగ్, మణిందర్ సింగ్, ఫజెల్ అత్రాచలిలను ఆయా ఫ్రాంఛైజీలు రిటైన్‌ చేసుకోకపోవడంతో వేలంలో పాల్గొని భారీ ధరకు అమ్ముడుపోయారు. స్టార్ రైడర్ పర్దీప్‌ నర్వాల్‌ను యూపీ యోధాస్, అస్లాం ముస్తఫాను పుణెరి పల్టాన్‌ రిటైన్‌ చేసుకున్నాయి. సీజన్‌-9లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు అందుకున్న అర్జున్ దేశ్వాల్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ అంటిపెట్టుకుంది. రైడర్లు రజనీష్‌, వినయ్‌తోపాటు డిఫెండర్లు పర్వేష్‌, మోహిత్, నితిన్‌లను తెలుగు టైటాన్స్‌ రిటైన్‌ చేసుకుంది. మూడు కేటగిరీల్లో ఫ్రాంఛైజీలు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లను జాబితాను ప్రొ కబడ్డీ లీగ్ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 

బెంగాల్‌ వారియర్స్‌, బెంగళూరు బుల్స్‌, దబాంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయింట్స్‌, హర్యానా స్టీలర్స్‌, పింక్‌ ప్యాంథర్స్‌, పట్నా పైరెట్స్‌, పుణేరి పల్టన్స్‌, తమిళ్‌ తలైవాస్‌, తెలుగుటైటాన్స్‌,  యు ముంబా, యూపీ యోథా జట్టు.. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ 10 టైటిల్‌ కోసం పోటీ పడనున్నాయి. డిసెంబర్‌ 2న ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10 ఆరంభం కానుంది.

టాప్ హెడ్ లైన్స్

Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Sachin Advice To Harbhajan : సచిన్  చెప్పిన ఆ ఒక్క గోల్డెన్ వర్డ్.. నా లైఫ్ ను టర్న్ చేసింది.. మాజీ స్టార్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
సచిన్  చెప్పిన ఆ ఒక్క గోల్డెన్ వర్డ్.. నా లైఫ్ ను టర్న్ చేసింది.. మాజీ స్టార్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
Vaibhav Sooryavanshi Confident: డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Embed widget