అన్వేషించండి

Vinesh Phogat: రెజ్లర్లు బరువు ఎందుకు తగ్గాలి? వెయిట్ విషయంలో ఎందుకింత కచ్చితంగా ఉంటారు?

Olympics 2024: ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనే రెజ్లర్లు బరువు విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రెండు రోజుల పాటు బరువు చెక్ చేసి అప్పుడు పోటీ చేసేందుకు అనుమతినిస్తారు.

Paris Olympics 2024: 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు వేసిన వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇవేం రూల్స్‌ అని అంతా పెదవి విరుస్తున్నారు. ఈ నిబంధనల విషయంలో వాళ్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు రెజ్లింగ్ ఫెడరేషన్ కూడా ఇప్పటికే వెల్లడించింది. అయితే...అంతకు ముందు రోజు రాత్రి వినేశ్ ఫోగట్ బరువు తగ్గేందుకు చాలా శ్రమించింది. కానీ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేకపోయింది. అసలు ఒలింపిక్స్‌లో ఈ బరువుకి ఎందుకంత ప్రియార్టీ ఇస్తారు..? వినేశ్ ఫోగట్‌ బరువు తగ్గించుకోడానికి ఎందుకంత కష్టపడింది..? అనే చర్చ కూడా జరుగుతోంది. సాధారణంగా ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు తమ ఆటను బట్టి వెయిట్ కేటగిరీలు ఉంటాయి. రెజ్లర్లు, బాక్సర్‌లతో పాటు అందరికీ ఇవి వర్తిస్తాయి. రూల్స్ ప్రకారం వాళ్లు చెప్పినంత బరువు మాత్రమే ఉండాలి. కాస్త ఎక్కువున్నా సరే వెంటనే పోటీ నుంచి తప్పించేస్తారు. అందుకే చాలా మంది క్రీడాకారులు ఇలాంటి పోటీల్లో పాల్గొనే ముందు బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. కిలోల కొద్దీ బరువు తగ్గిన వాళ్లూ ఉన్నారు. ఇక రెజ్లింగ్ విషయంలో ఈ రూల్స్ మరింత కఠినంగా ఉంటాయి. 

రూల్ అంటే రూలే..

United World Wrestling ప్రకారం రెజ్లింగ్ పోటీ జరిగే ఉదయమే అందరి బరువునీ చెక్ చేస్తారు. అయితే..అంతకు ముందే రెజ్లర్లకు వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తరవాత ఒక్కొక్కరి బరువు పరిశీలిస్తారు. మొదటి రోజున దాదాపు అరగంట పాటు వెయిట్‌ చెక్ చేస్తారు. ఈ అరగంటలో రెజ్లర్లు ఎన్ని సార్లైనా తమ బరువు చెక్ చేసుకోవచ్చు. రెండో రోజున మరో 15 నిముషాల పాటు  weigh-in ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలోనే వాళ్ల ప్రమాణాలకు తగ్గట్టుగా లేకపోతే పోటీ నుంచి తప్పిస్తారు. వినేశ్ ఫోగట్ విషయంలో ఇదే జరిగింది. అయితే...సాధారణంగా ఆమె బరువు 55-56 కిలోల వరకూ ఉండేది. ఎప్పుడైతే  50 kg కేటగిరీలో పోటీ చేయాలని నిర్ణయించుకుందో అప్పుడే బరువు తగ్గాల్సి వచ్చింది.  అంటే దాదాపు 5-6 కిలోల వరకూ తగ్గిపోవాలి. అందుకే ఆ స్థాయిలో శ్రమించింది. కానీ...డీహైడ్రేషన్‌కి గురైంది.

United World Wrestling రూల్స్ ప్రకారం పోటీ చేస్తున్న అన్ని రోజుల్లోనూ అథ్లెట్‌ అదే బరువుని మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా రెజ్లింగ్ పోటీలు రెండు రోజులు జరుగుతాయి. ఈ రెండు రోజుల్లోనూ వినేశ్ ఫోగట్ బరువు 50 కిలోలుగానే ఉండాలి. కానీ రెండో రోజు 100 గ్రాములు ఎక్కువగా ఉండడం వల్ల ఆమెపై అనర్హతా వేటు వేశారు. ( Olympics 2024: బరువు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు, సమయం అడిగినా ఇవ్వలేదు - వినేశ్ ఫోగట్‌ అనర్హతా వేటుపై WFI)

ప్రమాదకరం కాదా..?

రెజ్లింగ్‌లో మొదటి రోజు ఫస్ట్ రౌండ్ నుంచి సెమీ ఫైనల్స్ వరకూ జరుగుతాయి. ఆ తరవాత రెండో రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. గోల్డ్ మెడల్ వచ్చేది రానిది తేలేది రెండో రోజే. అందుకే బరువు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే...ఇక్కడ కీలక విషయం ఏంటంటే...2017కి ముందు వరకూ అథ్లెట్‌ బరువుని ఒకటే రోజు లెక్కించే వాళ్లు. కానీ...ఒక్క రోజులో బరువు తగ్గడం కష్టం కాబట్టి ఈ వెయిన్ ఇన్ ప్రాసెస్‌ని రెండు రోజులకు పొడిగించారు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. రెండు రోజుల్లో ఓ మనిషి అంత బరువు ఎలా తగ్గుతాడని ప్రశ్నిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తీసుకోకుండా, కార్బొహైడ్రేట్స్ ఇవ్వకుండా ఆ స్థాయిలో శరీరాన్ని కష్టపెడితే సమస్యలు వస్తాయని వాదిస్తున్నారు. ఇప్పుడు వినేశ్ ఫోగట్ కూడా అంతే కఠినంగా వ్యాయామం చేసి చివరకు ఆసుపత్రి పాలైంది. అందుకే ఈ నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Also Read: Vinesh Phogat Replacement: రెజ్లింగ్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ స్థానంలో ఆమెకు ఛాన్స్, షెడ్యూల్ విడుదల చేసిన నిర్వాహకులు

టాప్ హెడ్ లైన్స్

Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget