![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Paris Olympics 2024: నేడు మళ్లీ బరిలోకి మనూ భాకర్, ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్ ఇదే
Olympic Games Paris 2024: రెండు పతకాలతో సత్తా చాటిన స్టార్ షూటర్ మను బాకర్ మళ్లీ నేడు బరిలోకి దిగనుంది. ఈ రోజు గనుక మను పతకం సాధిస్తే భారత చరిత్రలో ఎవరూ సాధించని ఘనతను తను సాధించినట్టే.
![Paris Olympics 2024: నేడు మళ్లీ బరిలోకి మనూ భాకర్, ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్ ఇదే Paris 2024 Olympics Day 7 Indians in action today August 2 schedule full list of events Focus on Manu Bhaker in busy day for India Paris Olympics 2024: నేడు మళ్లీ బరిలోకి మనూ భాకర్, ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/601478d94ef4ede996e986b835833ea117225580749311036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India at Olympics on Day 7 Schedule: పారిస్ ఒలింపిక్స్(Paris Olymics 2024)లో రెండు పతకాలతో సత్తా చాటి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న స్టార్ షూటర్ మను బాకర్ మళ్లీ నేడు బరిలోకి దిగనుంది. ముచ్చటగా మూడో పతకంపై గురిపెట్టిన మను ఆ ఘనత సాధిస్తే భారత చరిత్రలో ఎవరూ సాధించని ఘనతను తన పేరిట లిఖించుకోవడం ఖాయం. చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలని భావిస్తున్న మనూ.. ఆ ఘనత సాధించాలని భారత క్రీడాభిమానులు వేయి కాదు కోట్ల కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరో వైపు పతక ఆశలు రేపుతున్న బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ కూడా నేడు క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నాడు. నేడు తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర టీమ్ ఈవెంట్ కూడా ఉంది. నేటి నుంచి అథ్లెటిక్స్ ప్రారంభం కానున్నాయి. మహిళల 5000 మీటర్ల హీట్ 1, మహిళల 5,000 మీటర్ల హీట్ 2, పురుషుల షాట్‌పుట్‌లో భారత అథ్లెట్లు తలపడుతూ ఆశలు రేపుతున్నారు
ఇవాళ్టీ షెడ్యూల్ ఇలా
గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 2 శుభంకర్ శర్మ -గగన్‌జీత్ భుల్లర్ (12:30 PM)
షూటింగ్
మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ మను భాకర్-ఈషా సింగ్ (12:30 PM)
మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ మను భాకర్-ఈషా సింగ్ (రాపిడ్) (3:30PM)
పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ అనంతజీత్ సింగ్ నరుకా (1:00PM)
ఆర్చరీ
రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ధీరజ్ బొమ్మదేవర/అంకితా భకత్(విలువిద్య 1:19 PM)
రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్‌ఫైనల్స్‌లో ధీరజ్ బొమ్మదేవర/అంకిత భకత్ (అర్హత సాధిస్తే)(5:45PM)
రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ సెమీఫైనల్స్‌లో ధీరజ్ బొమ్మదేవర/అంకిత భకత్ (అర్హత సాధిస్తే) (7:01 PM)
జూడో
మహిళల +78 కేజీల ఎలిమినేషన్ రౌండ్ తులికా మన్ vs ఇడాలిస్ ఓర్టిజ్( 1:30 PM)
మహిళల +78 కేజీల ఎలిమినేషన్ రౌండ్ 16 తులికా మాన్ క్వాలిఫ్ అయితే(2:30 PM)
మహిళల +78 కేజీల ఎలిమినేషన్ క్వార్టర్ ఫైనల్స్ తులికామాన్ (అర్హత సాధిస్తే)(3:30PM)
+78kg రెపెచేజ్ పోటీ లేదా సెమీఫైనల్స్‌లో తులికా మాన్ (అర్హత సాధిస్తే) (7:45 PM)
మహిళల +78 కేజీలలో తులికా మాన్ - కాంస్య పతక మ్యాచ్ (సెమీఫైనల్స్ ఓడిపోతే)
రోయింగ్ 1:48 PM
పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్‌లో బల్‌రాజ్ పన్వర్ (ఫైనల్ డి)
సెయిలింగ్
నేత్ర కుమనన్ మహిళల డింగీ రేస్ 3 & 4 (3.45 PM)
పురుషుల డింగీ రేస్ 3 & 4లో విష్ణు శరవణన్ (7:05 PM)
హాకీ
పురుషుల పూల్ B లో భారత్ vs ఆస్ట్రేలియా (4.45 PM)
బ్యాడ్మింటన్
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో లక్ష్య సేన్ vs చౌ టియన్ చెన్ (చైనీస్ తైపీ) (6:30 PM)
అథ్లెటిక్స్'
మహిళల 5000 మీటర్ల హీట్ 1లో అంకిత ధ్యాని (9:40 PM)
మహిళల 5,000 మీటర్ల హీట్ 2లో పరుల్ చౌదరి (10:06 PM)
పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ (11:40)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)