X

IND vs NZ 2021: ఆఖరి రోజు మొదటి సెషన్ కివీస్‌దే... వికెట్ల కోసం శ్రమిస్తున్న టీమిండియా బౌలర్లు

కాన్పూర్‌ టెస్టు ఆసక్తిగా మారింది. వికెట్ల కోసం టీమిండియా శ్రమిస్తుంటే... నిర్దేశించిన పరుగులు ఛేదించాలన్న కసితో న్యూజిలాండ్ ఆడుతోంది.

FOLLOW US: 

కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వికెట్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది టీమిండియా. ఐదో రోజు ఆట మొదట్లోనే న్యూజిలాండ్ బ్యాటర్ సోమర్‌ విల్లే ఇచ్చిన క్యాచ్‌ను చతేశ్వర్‌ పుజారా నేలపాలు చేశాడు. ఆ తర్వాత కివీస్ ఆటగాళ్లు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. 

284 పరుగులు ఛేదించే లక్ష్యంతో కివీస్‌ చాలా నింపాదిగా ఆడుతోంది. లంచ్‌ విరామ సమయానికి ఒక వికెట్ నష్టానికి 79పరుగులు చేసింది. సోమర్‌ విల్లే, టామ్‌ లాథమ్‌ భారత్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 
మూడు పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు ఆట స్టార్ట్ చేసిన కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ మొదటి సెషన్‌లో 76 పరుగులు జోడించి టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. న్యూజిలాండ్ విజయం సాధించాలంటే 205 పరుగులు చేయాలి. ఇంకా తొమ్మిది వికెట్లు ఆ టీం చేతిలో ఉన్నాయి. 

టీమిండియా ఐదో రోజు మొదటి సెషన్‌లో 31ఓవర్లు వేసి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయింది. ఇంకా రెండు సెషన్స్‌ మిగిలి ఉన్నాయి. భారత్ వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది. లేకుంటే డ్రాగా మ్యాచ్ ముగుస్తుంది. 

వికెట్ల కోసం భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. కెప్టెన్ రహానె... బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నాడు. రకరకాల కాంబినేషన్‌లో కివీస్‌ బ్యాట్సర్లను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నాడు. అయినా ఎక్కడా ఛాన్స్ దొరకడం లేదు. మొదట్లో సోమర్‌ విల్లే ఇచ్చిన క్యాచ్‌ను ఛతేశ్వర్‌ పుజారా వదిలివేశాడు. ఆ ఒక్కటి మినహా ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా న్యూజిలాండ్ బ్యాటర్లు భారత్‌ బౌలర్లతో ఆడుకుంటున్నారు. 

నాల్గో రోజు భారత్‌ తన ఇన్నింగ్స్‌ను డిక్లర్ చేసిన తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. కివీస్ ఓపెనర్‌ విల్‌యంగ్‌ రెండు పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.  అదే ఊపు ఐదో రోజు కొనసాగుతుంది టీమిండియా ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహ పడ్డారు. కానీ అన్ని రకాల బౌలింగ్‌ను కివీస్‌ ధీటుగా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం లాథమ్‌ 35, సోమర్‌ విల్లే 36పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

Also Read: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
Also Read: సైలెంట్‌గా ఫ్యాన్స్‌కు క్లాస్ పీకుతున్న స‌ల్మాన్ ఖాన్‌... మిగతా స్టార్స్ ఏం చేస్తారో?
Also Read: బాల్ తగిలితే... ఆ దెబ్బకు పాతిక కుట్లు పడ్డాయి. నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది!
Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... బెనిఫిట్ షోస్‌కు అంతా రెడీ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: India IND vs NZ 2021 Kanpur Test Latham Somerville Zealand

సంబంధిత కథనాలు

Metro Brands Net Profit: లాభం మామూలుగా లేదు! 54% పెరిగిన ప్రాఫిట్‌

Metro Brands Net Profit: లాభం మామూలుగా లేదు! 54% పెరిగిన ప్రాఫిట్‌

Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!

Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!

Lakshya Sen Wins Final: కేక పెట్టించిన కుర్రాడు! ప్రపంచ ఛాంఫ్‌కు షాకిచ్చిన లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Final: కేక పెట్టించిన కుర్రాడు! ప్రపంచ ఛాంఫ్‌కు షాకిచ్చిన లక్ష్యసేన్‌

Anushka on Kohli Resignation: ఎంతో ఎత్తుకు ఎదిగావు.. లోపల, బయట కూడా.. విరాట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!

Anushka on Kohli Resignation: ఎంతో ఎత్తుకు ఎదిగావు.. లోపల, బయట కూడా.. విరాట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!

Anurag Thakur on Twitter: 11,000 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్‌ స్టేడియం.. ఇండియాలోనే!

Anurag Thakur on Twitter: 11,000 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్‌ స్టేడియం.. ఇండియాలోనే!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన

Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన

Pragathi: 'ఊ అంటావా మావా..' సాంగ్ కి ప్రగతి మాస్ స్టెప్పులు.. ఓ లుక్కేయండి..

Pragathi: 'ఊ అంటావా మావా..' సాంగ్ కి ప్రగతి మాస్ స్టెప్పులు.. ఓ లుక్కేయండి..

Tecno POP 5 LTE Sale: రూ.6 వేలలోనే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. సేల్ ప్రారంభం.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Tecno POP 5 LTE Sale: రూ.6 వేలలోనే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. సేల్ ప్రారంభం.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Janhvi Kapoor: జాన్వీకపూర్ హాట్ నెస్.. తట్టుకోవడం కష్టమే..

Janhvi Kapoor: జాన్వీకపూర్ హాట్ నెస్.. తట్టుకోవడం కష్టమే..