అన్వేషించండి

Who Is Prashant Veer: మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?

Who is Prashant Veer, IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన యువ క్రికెటర్ ప్రశాంత్ వీర్‌ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆర్సీబీతో మయాచ్ లో రాణించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంఎస్ ధోనీ కనిపించడం లేదు. మరోవైపు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల యువ క్రికెటర్ ప్రశాంత్ వీర్‌ అరంగేట్రం చేశాడు. ప్రశాంత్ వీర్ ఒక ఆల్‌రౌండర్ క్రికెటర్. చెన్నై జట్టులో మాథ్యూ షార్ట్ స్థానంలో అతడికి ఛాన్స్ లభించింది. ఇతడ్ని దృష్టిలో ఉంచుకునే రవీంద్ర జడేజా లాంటి స్టార్ ఆల్ రౌండర్ ను చెన్నై వదులుకుందని టాక్ నడుస్తోంది. గత ఏడాది జరిగిన ఐపీెల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 14.2 కోట్లు వెచ్చించి ప్రశాంత్ వీర్‌ను తీసుకుంది. 

ఈ సీజన్లో సీఎస్కే 3 మ్యాచులాడగా రెండింట్లో ప్రశాంత్ వీర్ ప్లేయింగ్ లెవన్ లో ఉన్నాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచులో 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచులో 29 బంతుల్లో 43 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్మార్మ్ స్పిన్నర్ కు బౌలింగ్ చేసే అవకాశం ఇంకా రాలేదు. జడేజా ప్రత్యామ్నాయంగా సీఎస్కే మేనేజ్‌మెంట్ ప్రశాంత్ వీర్‌ను భావిస్తోంది. వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ జడేజాను అతడు రీప్లేస్ చేయగలడా అని సీఎస్కే ఫ్యాన్స్ సైతం ఐపీఎల్ వేలంలో అన్ క్యాప్డ్ ప్లేయర్ ధర చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఎవరీ ప్రశాంత్ వీర్

 ప్రశాంత్ వీర్ 2005 నవంబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జన్మించాడు. ఎడమచేతి వాటం ఆఫ్‌ స్పిన్ బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఉంది. యూపీ టీ20 లీగ్‌లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున రాణించడంతో ఇతనికి తొలిసారి గుర్తింపు లభించింది. ఆపై సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ప్రశాంత్ అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 

డొమెస్టిక్ క్రికెట్‌లో యూపీ తరపున ఆడిన ఈ 20 ఏళ్ల యువ క్రికెటర్ 7 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీయడమే కాకుండా 170 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు లెఫ్టార్మ్ ఆఫ్‌ స్పిన్ బౌలింగ్ చేస్తుండటంతో ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ కొత్త రవీంద్ర జడేజా అని పిలుస్తోంది. 

ప్రశాంత్ వీర్ కెరీర్

ప్రశాంత్ వీర్ గత ఏడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్ తరపున డొమెస్టిక్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో 112 పరుగులు చేశారు. అలాగే 8 లిస్ట్-A మ్యాచ్‌ల్లో 133 పరుగులు చేసి 10 వికెట్లు తీయడంతో సీఎస్కే మేనేజ్ మెంట్ దృష్టిలో పడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో రాణించడంతో ఇతనికి ఏకంగా ఐపీఎల్ కాంట్రాక్ట్ లభించింది. అది కూడా అత్యధిక ధర పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా కార్తీక్ శర్మతో కలిసి 14.2 కోట్లకు లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అవేష్ ఖాన్ 10 కోట్ల (2022) అన్‌క్యాప్డ్ రికార్డును బద్ధలుకొట్టారు.

ప్రశాంత్ వీర్ ఉత్తరప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటికీ, రెడ్ బాల్ క్రికెట్‌లో అంతగా రాణించలేదు.  4 ఫస్ట్-క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లోనూ యువ సంచలనం అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget