IPL 2024: హసరంగ స్థానంలో వియస్కాంత్, స్పిన్నర్‌పై భారీ అంచనాలు
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హసరంగ స్థానంలో 22 ఏళ్ల శ్రీలంక లెగ్ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్‌తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.
Vijayakanth Viyaskanth Replaces Fellow Sri Lankan Wanindu Hasaranga: ఐపీఎల్(IPL) 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga) సేవల్ని కోల్పోయింది. గాయం కారణంగా హసరంగ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఎడమ మడమ గాయంతో బాధపడుతున్న హసరంగ కొన్ని రోజులకు తిరిగి వస్తాడని భావించారు. కానీ అతడు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హసరంగ స్థానంలో 22 ఏళ్ల శ్రీలంక లెగ్ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్(Vijayakanth Viyaskanth)తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ విజయకాంత్‌కు స్వాగతం పలుకుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. వనిందు హసరంగ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి అందుబాటులో లేడని.... అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని , హసరంగ స్థానంలో శ్రీలంక యువ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్ జట్టుతో కలిశాడని సన్‌రైజర్స్ పోస్ట్ చేసింది. టాటా IPLలో బేసిక్ ప్రైస్ రూ.50 లక్షలతో చేరాడని ఎస్ఆర్‌హెచ్ పేర్కొంది. విజయకాంత్ ఇప్పటివరకు శ్రీలంక తరఫున ఒక T20 ఇంటర్నేషనల్ ఆడాడు. 2023 అక్టోబర్ లో ఆఫ్ఘానిస్థాన్‌పై అరంగేట్రం చేసి నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒక్క వికెటే పడగొట్టాడు. ఇతర లీగ్స్‌తో కలిపి 33 టీ20లు ఆడిన ఈ యువ స్పిన్నర్ 18.78 సగటుతో 42 వికెట్లు తీశాడు. పొట్టి ఫార్మాట్‌లో పెద్దగా అనుభవం లేకపోయినా అతడికి హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.50 లక్షలు చెల్లించనుంది.
Also Read: తెలుగోడా మజాకా, ఎవరీ నితీశ్‌కుమార్ రెడ్డి
మెరిసిన తెలుగు కుర్రాడు
పంజాబ్ కింగ్స్‌తో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో..... విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి 37 బంతుల్లో 4 ఫోర్లు.. అయిదు సిక్సర్లతో 64 పరుగులు చేయడంతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలో లక్ష్యం దిశగానే సాగలేదు. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్‌కు పరుగులు రావడం గగనమైపోయింది. కానీ శశాంక్‌సింగ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి.పంజాబ్‌ను పోటీలోకి తెచ్చాడు. 25 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సుతో 46 పరుగులు చేసిన శశాంక్, 15 బంతుల్లో 3 పోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసిన అషుతోష్ శర్మపంజాబ్‌కు గెలుపుపై ఆశలు రేపారు. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులుకావాల్సి ఉండగా 26 పరుగులు వచ్చాయి. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read:అభిషేక్ శర్మ నయా రికార్డు, సన్‌రైజర్స్ తరపున తొలి బ్యాటర్
20 ఏళ్ల నితీష్‌కుమార్ 2003లో వైజాగ్‌లో జన్మించాడు. నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, హిందుస్తాన్ జింక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్ 14 ఏళ్ల వయస్సులోనే విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో 176.41 యావరేజ్‌తో 1237 పరుగులు, బౌలింగ్‌లో 26 వికెట్లు తీశాడు.