IPL 2024: తెలుగోడా మజాకా, ఎవరీ నితీశ్‌కుమార్ రెడ్డి
Nitish Reddy: పంజాబ్ కింగ్స్‌తో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయంలో తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు.
![IPL 2024: తెలుగోడా మజాకా, ఎవరీ నితీశ్‌కుమార్ రెడ్డి PBKS vs SRH Who is Nitish Reddy The 20 year old Telugu Boy IPL 2024: తెలుగోడా మజాకా, ఎవరీ నితీశ్‌కుమార్ రెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/e6f4020d7c4417a86a2276b323785b331712709929559872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఎవరీ నితీశ్ కుమార్
20 ఏళ్ల నితీష్‌కుమార్ 2003లో వైజాగ్‌లో జన్మించాడు. నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, హిందుస్తాన్ జింక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్ 14 ఏళ్ల వయస్సులోనే విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో 176.41 యావరేజ్‌తో 1237 పరుగులు, బౌలింగ్‌లో 26 వికెట్లు తీశాడు. బీసీసీఐ నుంచి 2017-18 ఏడాదికి గాను ‘బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్16’ జగన్మోహియా దాల్మియా అవార్డు గెలుచుకున్నాడు. 2020 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అనంతరం 2021లో లిస్ట్-ఏ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20ల్లో కూడా నితీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ రెడ్డి.. 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 403 పరుగులతో పాటు 14 వికెట్లు సాధించారు. దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో నితీశ్ రెడ్డిని ఐపీఎల్ 2023 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో నితీష్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ నాలుగో ఆంధ్రా క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాల రావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)