అన్వేషించండి

IPL 2024: అభిషేక్‌ శర్మ నయా రికార్డు, సన్‌రైజర్స్‌ తరపున తొలి బ్యాటర్‌

Sunrisers Hyderabad :పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ నయా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున  వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు.

Abhishek Sharma becomes first player to achieve this feat for SRH: ఐపీఎల్ (IPL)2024లో పంజాబ్ కింగ్స్‌(PBKS)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్(SRH) యువ బ్యాటర్ అభిషేక్ శర్మ నయా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున  వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 1,000 పరుగులు చేసిన పూర్తి చేసిన మొదటి ఆన్‌క్యాప్‌డ్ బ్యాటర్‌గా అభిషేక్‌ రికార్డు నెలకొల్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాదే కాకుండా డెక్కన్ చార్జర్స్ తరపున కూడా ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. హైదరాబాద్ తరఫున 49 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు. మొత్తంగా చూస్తే సన్‌రైజర్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరు మీద ఉంది. వార్నర్ 4,014 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలున్నాయి. 

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో....
 పంజాబ్‌ కింగ్స్‌తో చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు పరుగుల తేడాతో..... విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి 37 బంతుల్లో 4 ఫోర్లు.. అయిదు సిక్సర్లతో 64 పరుగులు చేయడంతో హైదరాబాద్‌ భారీ స్కోరు చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్‌... ఆరంభంలో లక్ష్యం దిశగానే సాగలేదు. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పంజాబ్‌కు పరుగులు రావడం గగనమైపోయింది.  కానీ శశాంక్‌సింగ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిపంజాబ్‌ను పోటీలోకి తెచ్చాడు. 25 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సుతో 46 పరుగులు చేసిన శశాంక్‌, 15 బంతుల్లో 3 పోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసిన అషుతోష్‌ శర్మ పంజాబ్‌కు గెలుపుపై ఆశలు రేపారు. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు....... కావాల్సి ఉండగా 26 పరుగులు వచ్చాయి. దీంతో హైదరాబాద్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

నితీశ్‌కుమార్ రెడ్డి ఒక్కడే.. 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. తొలి వికెట్‌కు ట్రానిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ 27 పరుగులు జోడించారు. 15 బంతుల్లో నాలుగు ఫోర్లతో 21 పరుగులు చేసిన ట్రానిస్‌ హెడ్‌ను అవుట్ చేసి అర్ష్‌దీప్‌ తొలి షాక్‌ ఇచ్చాడు. అదే స్కోరుపై మార్క్రమ్‌ కూడా అవుటయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ సింగ్‌...హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టాడు. రాహుల్‌ త్రిపాఠి 11, క్లాసెన్‌ తొమ్మిది పరుగులు చేసి అవుటవ్వడంతో హైదరాబాద్‌ స్కోరు అసలు 130 అయినా దాటుతుందా అనిపించింది. కానీ తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి తన ఆటతో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. నితీశ్‌ కొట్టిన సిక్సులు చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. ఐపీఎల్‌లో నితీశ్‌ తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. హర్‌ ప్రీత్‌ బార్‌ వేసిన ఓవర్‌లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదిన నితీశ్‌... 32 బంతుల్లోనే అర్థ శతకం మార్క్‌ అందుకున్నాడు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసిన నితీశ్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. మళ్లీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి అర్ష్‌దీప్‌ షాక్‌ ఇచ్చాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 182  పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 4, శామ్‌కరణ్‌, హర్షల్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
CM Chandrababu: 'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP DesamNita Ambani Saree and jewelry | Trump Swearing Ceremony లో ప్రధాన ఆకర్షణగా నీతా,ముకేశ్ అంబానీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
CM Chandrababu: 'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
Nara Lokesh: 'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
CM Chandrababu: 'ఏపీ పెట్టుబడులకు అనుకూలం, భారీగా ఇన్వెస్ట్ చేయండి' - జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ
'ఏపీ పెట్టుబడులకు అనుకూలం, భారీగా ఇన్వెస్ట్ చేయండి' - జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ
RaghuRama plea on Jagan: జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
మాజీ సీఎం జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
Embed widget