Fastest Delivery In IPL 2022: ఉమ్రాన్ మాలిక అరుదైన ఘనత - బుల్లెట్ లాంటి బంతులతో తన రికార్డులనే బ్రేక్ చేసిన SRH పేసర్
Umran Malik Fastest Delivery IN IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జమ్మూకాశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.
Umran Malik Fastest Delivery IN IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై వేదికగా బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జమ్మూకాశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన రికార్డును తానే బ్రేక్ (SRH Pacer Records Fastest Ball Of IPL 15) చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా నిలిచాడు. మే 5 ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 157 కి.మీ వేగంతో సీజన్‌లో అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీ (Umran Malik Fastest Delivery: )ని సంధించాడు ఉమ్రాన్ మాలిక్. లీగ్ చరిత్రలో ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ బాల్ సంధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన్ షాట్ టైట్ గంటకు 157.71 కి.మీ వేగంతో సంధించిన బంతి ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీగా ఉంది.
ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ 154 కి.మీ వేగంతో విసిరిన బంతి ఫాస్టెస్ట్ డెలివరీగా ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ గంటకు 156, 157 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించాడు. తద్వారా ఐపీఎల్‌లో రెండు ఫాస్టెస్ట్ డెలివరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. టాప్ 5లోనూ మరిన్ని ఫాస్టెస్ట్ బాల్స్ ఉమ్రాన్ ఖాతాలో ఉన్నాయి. సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్ గంటకు 157 కి.మీ వేగంతో సంధించగా.. ఢిల్లీ ప్లేయర్ రోవ్‌మన్ పావెల్ ఆ బాల్‌ను బౌండరీకి తరలించాడు. పావెల్ కేవలం 35 బంతుల్లోనే 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పావెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఉమ్రాన్ ఆఖరి ఓవర్లో వరుసగా 6, 0, 4, 4, 4, 1 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో బ్యాటింగ్ ఛాన్స్ రాని డేవిడ్ వార్నర్ శతకానికి 8 పరుగుల దూరంలో ఆగిపోయాడు.
Only Shaun Tait has bowled a faster delivery (157.71 kmph) than Umran Malik in the 15-year history of IPL.
— CricTracker (@Cricketracker) May 5, 2022
📸: Disney+Hotstar#IPL2022 pic.twitter.com/gNFf6vo3lX
వేగం ఉంది.. కానీ లాభం లేదా?
సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగవంతమైన బంతులు సంధించే బౌలర్‌గా నిలుస్తున్నాడు. కానీ అతడి బౌలింగ్‌లో టాపార్డర్ నుంచి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వరకు తేలికగా ఆడేస్తున్నారు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 4 ఓవర్లలో ఢిల్లీ టీమ్ 52 పరుగులు పిండుకుందంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఇదే సీజన్‌లో మరిన్ని మ్యాచ్‌లలో టీమ్ నుంచి ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు ఉమ్రాన్.
The Fastest ball of the season 157Kph Umran Malik is a dale steyn inspiration #SRHvsDC pic.twitter.com/nzEqCNR0ql
— Anurag Maurya{Allahabad}🇮🇳 (@AnuragM88227408) May 5, 2022
బుల్లెట్ లాంటి బంతులు సంధిస్తున్న ఉమ్రాన్‌కు సరైన కోచింగ్ ఇస్తే టీమిండియా తరఫున అద్భుతాలు సాధిస్తాడని తాజా, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 5 వికెట్ల (5/25)తో రాణించాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Watch Viral Video: సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఫ్యాన్‌కు లవ్ ప్రపోజ్ చేసిన అమ్మాయి!