అన్వేషించండి

IPL 2024: ఒక్క అడుగు- హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌కు అడుగే దూరం

SRH vs GT : ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగులు సాధించి, లక్ష్యాన్ని పది ఓవర్లలోపే ఛేదించి భీకర ఫామ్‌లో ఉన్న హైదరాబాద్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ అడ్డుకోగలదా అన్నది ఆసక్తిగా మారింది.

SRH vs GT Preview and Prediction : ఐపీఎల్‌(IPL)లో ప్లే ఆఫ్‌ బెర్తుపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)... ప్లే ఆఫ్‌ రేసు నిష్క్రమించిన గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో సమరానికి సిద్ధమైంది. సొంత మైదానంలో  ఆడుతూ భీకర ఫామ్‌లో ఉన్న హైదరాబాద్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ అడ్డుకోగలదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగులు సాధించి... లక్ష్యాన్ని పది ఓవర్లలోపే ఛేదించి... భీకరంగా కనిపిస్తున్న హైదరాబాద్‌ బ్యాటర్లను గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లు ఏ మాత్రం అడ్డుకోగలరో చూడాలి.
 
ఒక్క విజయం చాలు
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయం సాధిస్తే హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌కు చేరుతుంది. హైదరాబాద్‌ ఒక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్‌లోనే గెలిచి ప్లే ఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకోవాలని హైదరాబాద్‌ చూస్తోంది.  పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌ 2లో ఉండాలని చూస్తోంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్‌ గెలిస్తే అది సాధ్యమవుతుంది. మంచి రన్‌రేట్‌ ఉన్న హైదరాబాద్‌కు అది సాధ్యమయ్యే అవకాశం ఉంది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో ఇప్పటికే 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.  మిగిలిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే 18 పాయింట్‌లతో హైదరాబాద్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంది. కాబట్టి గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో సాధికార విజయం సాధించాలని హైదరాబాద్‌ గట్టి పట్టుదలతో ఉంది. 
 
ఆత్మ విశ్వాసంతో హైదరాబాద్‌
మే 8న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించి హైదరాబాద్‌ మరో రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్‌ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కేవలం 9.4 ఓవర్లలో 166 పరుగులను ఛేదించారు. భీకర ఫామ్‌లో ఉన్న వీరిద్దరిని అడ్డుకోవడం గుజరాత్‌ బౌలర్లకు తలకు మించిన భారమే. SRH ఈ సీజన్ అంతటా నమ్మశక్యం కాని విజయాలను సాధించింది. కానీ ఎక్కువగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపైనే ఆధారపడడం హైదరాబాద్‌ విజయావకాశాలను దెబ్బ తీస్తోంది. వీరిద్దరూ అవుటైన తర్వాత ఇన్నింగ్స్‌ను  పునర్నిర్మించడంలో  నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. 
 
గుజరాత్‌కు పోయేదేమీ లేదు
 ఇప్పటికే ప్లే ఆఫ్‌కు దూరమైన గుజరాత్‌కు ఈమ్యాచ్‌ ఓటమితో పోయేదేమీ లేదు. అయినా పరువు కోసమైనా ఈ మ్యాచ్‌ నెగ్గాలని గుజరాత్‌ కోరుకుంటోంది. విజయంతో  ఈ సీజన్‌ను ముగించాలని  చూస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గుజరాత్‌ ప్లే ఆఫ్‌కు దూరమైంది. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ అదరగొడుతున్నారు. డేవిడ్ మిల్లర్ ఈ సీజన్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ పుంజుకుంటుదేమో చూడాలి. 
 
జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ .
 
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్ 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget