IPL 2024: టాస్ గెలిచిన హైదరాబాద్ , ఏం తీసుకుందంటే?
SRH VS CSK IPL 2024: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.
SRH VS CSK IPL 2024 Sunrisers Hyderabad opt to bowl: చెన్నై సూపర్‌కింగ్స్(CSK) తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్... మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఛేదనలో విఫలమైన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో ఛేదనలో గెలవాలని పట్టుదలగా ఉంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.
ఇద్దరిదీ ఒకే కధ ...
ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది మ్యాచులు ఆడిన చెన్నై... నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉంది. చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌కు ఎనిమిది పాయింట్లే ఉన్నా చెన్నై రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో ప్రస్తుతం అయిదో స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే చెన్నైకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఈ సీజన్‌లో రెండుసార్లు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడి గెలవాలంటే చెన్నై అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది. చెన్నై బ్యాటింగ్ మొత్తం కెప్టెన్ గైక్వాడ్ చుట్టూ తిరుగుతోంది. రుతురాజ్ బ్యాట్‌తో రాణిస్తున్నాడు. రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో చెలరేగుతున్నా చెన్నై టాప్ ఆర్డర్ ఇంకా గాడిన పడలేదు. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ ఇద్దరూ పరుగులు చేయకపోవడం చెన్నైను ఆందోళన పరుస్తోంది. చెన్నై బౌలింగ్ మాత్రం చాలా బలంగా ఉంది. పతిరాణ మెరుగ్గా రాణిస్తున్నాడు.
గత రికార్డులని బట్టి ..
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ బెంగళూరు, హైదరాబాద్ 24 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 13 విజయాలు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. హైదరాబాద్‌లో ఇరు జట్లు 8 మ్యాచుల్లో తలపడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు గెలవగా... బెంగళూరు రెండు గెలిచింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతవేద్ సుబ్రమణ్యన్.