అన్వేషించండి

RR vs MI: య‌శ‌స్వీ అద్భుత శతకం, ముంబైపై రాజస్తాన్ ఘన విజయం

IPl2024 : రాజస్తాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ అదరగొట్టడంతకో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Rajasthan Royals won by 9 wkts: ఐపీఎల్‌ 2024లో రాజస్థాన్‌ జైత్రయాత్ర  దిగ్విజయంగా  కొనసాగుతోంది. ముంబయితో సొంతమైదానంలో జరిగిన పోరులో రాజస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. . తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ 18.4 ఓవర్లలోనే మరో 8 బాల్స్ ఉండగానే ఛేజ్ చేసింది. రాజస్తాన్ బ్యాటర్ యశస్తి జైశ్వాల్ సెంచరీతో విజృంభించాడు. . కెప్టెన్ సంజూ శాంస‌న్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దాంతో, ముంబై ఖాతాలో మరో ఓటమి చేరింది.

ముంబై పడుతూ... లేస్తూ..
రాజస్థాన్‌తో జరుగుతున్న  మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆరంభంలోనే దిమ్మతిరిగే షాక్‌లు తగిలాయి. అయిదు బంతుల్లో ఆరు పరుగులు చేసిన రోహిత్‌ శర్మను బౌల్ట్‌ అవుట్‌ చేసి ముంబైకు తొలి షాక్ ఇచ్చాడు. ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే ముంబైకు మరో షాక్‌ తగిలింది. మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ అయ్యాడు. కిషన్‌ను సందీప్‌ శర్మ అవుట్‌ చేశాడు. 
 
ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. సందీప్ శర్మ వేసిన 1.3 ఓవర్‌కు వికెట్ కీపర్‌ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తొలుత అంపైర్ నాటౌట్‌ ఇవ్వగా.. రాజస్థాన్‌ డీఆర్‌ఎస్ తీసుకుకోవటంతో అది అవుట్ గా డిక్లేర్ అయ్యింది. దీంతో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించిన సూర్యకుమార్‌ యాదవ్ కూడా పెవిలియన్‌ చేరాడు. ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లతో పది పరుగులు చేసిన సూర్యాను సందీప్‌ శర్మ అవుట్‌ చేశాడు. దీంతో 20 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  మహ్మద్‌ నబీ కూడా 27 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.
 
య‌శ‌స్వీ అజేయ‌ సెంచ‌రీ..
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 18.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 183 పరుగులు చేసి తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. ముంబై బౌలర్లు.. రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కేవలం పీయూష్ చావ్లా ఒక్కడే.. ఒక్క వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లంతా వికెట్లు తీ య్యాకపోవడంతో రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది.  స్ట్రాట‌జిక్ టైమ్‌లో వ‌ర్షం ప‌డ‌డంతో అంపైర్లు కాసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్ప‌టికి రాజ‌స్థాన్ స్కోర్ 61/0.
 జైస్వాల్  7 సిక్సులు, 6 ఫోర్ల తో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.   తన భాగస్వామిగా  సంజూ శాంసన్  కూడా 38 పరుగులతో రాణించాడు. బట్లర్  35  పరుగులు చేశాడు. రాజస్థాన్ జట్టుకి ఇది 5వ విజయం కాగా, ముంబైకి మూడో ఓటమి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
IPL 2026 Flop Playing XI: ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
Vaibhav Sooryavanshi News: సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా
సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా
IPL 2026 Most Sixes Given Bowlers: ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్ల వివరాలు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్ల వివరాలు.

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Embed widget