అన్వేషించండి

IPL 2024: ఢిల్లీకి దిమ్మతిరిగే షాక్‌, పంత్‌పై నిషేధం

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడు ఒక మ్యాచ్‌ ఆడకుండా సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

 Rishabh Pant Slapped With 1 Match Ban and  Hefty Fine : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)) జరగబోయే అత్యంత కీలక మ్యాచ్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌(Rishabh Pant)పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది.  ఈ నిర్ణయంతో ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌ తగిలింది. డీసీ జట్టు ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడగా, గత మంగళవారం రాజస్థాన్‌పై కూడా పునరావృతమైంది. దీంతో ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు పంత్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్‌ నిషేధం విధించారు. అలాగే ఇతర ఆటగాళ్లు కూడా రూ.12 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 50శాతం.. వీటిలో ఏది తక్కువైతే దానిని ఫైన్‌గా కట్టాల్సి ఉంటుందని పాలకమండలి వెల్లడించింది. మరోవైపు ఢిల్లీ జట్టు మ్యాచ్‌ రెఫరీ నిర్ణయాన్ని సవాల్‌ చేసినా ఫలితం లేకపోయింది. కాగా ఆదివారం బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్‌కు పంత్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. . దీంతో ఇవాళ్టీ మ్యాచ్‌లో పంత్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగనుంది. 


తొలి ఆటగాడు పంతే
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఒక మ్యాచ్‌ వేటుపడిన తొలి ఆటగాడు రిషభ్‌ పంత్‌. కీలక దశలో ఆడే అవకాశం లేకపోవడంతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌లు ప్రమాదంలో పడినట్లేనని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. బెంగళూరుతో కాకుండా లక్నోతో మే 14న ఢిల్లీ తలపడనుంది. 

కీలక మ్యాచ్‌లో పాపం ఇలా...
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో వరుసగా ఐదో విజయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నేసింది. ఈ సీజన్‌ను ఓటములతో ఆరంభించిన బెంగళూరు రెండో అర్ధ భాగంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంటూ వస్తోంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి బెంగళూరు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో కోహ్లీ 47 బంతుల్లో 92 పరుగులు చేసి సత్తా చాటాడు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. దీంతో పంజాబ్‌ను 60 పరుగులతో చిత్తు చేసిన బెంగళూరు... ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీకి షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కూడా గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పుంజుకుంది. గత మ్యాచ్‌లో పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను ఢిల్లీ ఓడించింది. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్ చెలరేగిపోతున్నారు. ఇప్పుడు బెంగళూరుపై అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఢిల్లీ చూస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget