అన్వేషించండి

RCB vs KKR, IPL 2022 LIVE: ఓవర్‌ కాన్ఫిడెంట్‌ KKRను ఓపికతో ఓడించిన RCB.. ఆఖరి వరకు టెన్షన్‌ టెన్షన్‌

RCB vs KKR match preview: ఐపీఎల్‌ 2022 ఆరో మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders) తలపడుతున్నాయి.

LIVE

Key Events
RCB vs KKR, IPL 2022 LIVE: ఓవర్‌ కాన్ఫిడెంట్‌ KKRను ఓపికతో ఓడించిన RCB.. ఆఖరి వరకు టెన్షన్‌ టెన్షన్‌

Background

IPL 2022 RCB vs KKR match preview:  ఐపీఎల్‌ 2022 ఆరో మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders)  తలపడుతున్నాయి. డీవై పాటిల్‌ స్టేడియంలో (DY Patil Stadium) జరిగే ఈ మ్యాచుపై భారీ అంచనాలే ఉన్నాయి. కేకేఆర్ (KKR) తన తొలి మ్యాచులో విజయంతో మురిసింది. ఇదే జోష్‌ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. మరోవైపు డుప్లెసిస్‌ నాయకత్వంలో వీర బాదుడు బాదినా ఓటమి తప్పించుకోలేని ఆర్‌సీబీ (RCB) కసితో  రగిలిపోతోంది. మరి వీరిద్దరిలో గెలుపు ఎవరిని వరించనుందో?

KKR ఆల్‌రౌండ్‌ షో

ఐపీఎల్‌ మొదటి మ్యాచులో కేకేఆర్‌కు టాస్‌ రూపంలో అదృష్టం వరించింది! డ్యూ ఫ్యాక్టర్‌ వల్ల ఛేదన సులభంగా మారింది. తొలుత స్పాంజీ బౌన్స్‌ను ఉపయోగించుకొని  సీఎస్‌కేను 131కే పరిమితం చేసింది. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ టార్గెట్‌ ఛేదించింది. పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ (Umesh Yadav) తన బౌలింగ్‌కు మరింత పదును పెట్టుకోవడం ప్లస్‌ పాయింట్‌. అలాగే వరుణ్‌ చక్రవర్తి (Varun chakravarthy) , సునిల్‌ నరైన్‌ (Sunil Narine) స్పిన్‌ జోడీ ప్రత్యర్థులకు ప్రమాదకరంగా మారిపోయింది. బెంగళూరుకు, స్పెషల్లీ కోహ్లీకి (Virat Kohli) వీరితో ముప్పు తప్పదు!

శివమ్‌ మావి, రసెల్‌ (Andre Russell) కాస్త పరుగుల్ని నియంత్రించాలి. ఇక బ్యాటింగ్‌లో కేకేఆర్‌ బలంగా కనిపిస్తోంది. ముంబయి, మహారాష్ట్ర పరిస్థితులపై అనుభవం ఉన్న అజింక్య రహానె (Ajinkya Rahane), శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) రెచ్చిపోతున్నారు. నితీశ్‌ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌ స్ట్రైక్‌ను చక్కగా రొటేట్‌ చేస్తున్నారు. వెంకటేశ్ అయ్యర్‌ (Venkatesh Iyer) భారీ షాట్లు ఆడటం మొదలు పెడితే ఇక కేకేఆర్‌కు తిరుగుండదు. టాప్‌ఆర్డర్‌ ఆడిందంటే ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ అవతలి వారిని బతకనివ్వడు.

 

 

RCB బ్యాటింగ్‌ అదుర్స్‌.. బౌలింగ్‌ బెదుర్స్‌

తొలి మ్యాచులో ఓటమి పాలైనప్పటికీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) బ్యాటింగ్‌ మాత్రం అందరినీ ఉర్రూతలూగించింది. మొదట్లో ఆచితూచి ఆడిన ఆర్‌సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్ (Faf du plessis) ఐదో ఓవర్‌ తర్వాత స్టేడియం చుట్టూ సిక్సర్లు, బౌండరీల వరద పారించాడు. అతడికి తోడుగా విరాట్‌ కోహ్లీ (Virat Kohli) బాదిన సిక్సర్లు ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాయి. ఆఖర్లో దినేశ్‌ కార్తీక్‌ (Dinesh Karthik) సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. టాప్‌ టు మిడిలార్డర్‌ అంతా ఫామ్‌లో ఉండటం ఆర్‌సీబీకి హ్యాపీ. మాక్సీ (maxwell) వచ్చేశాడంటే ఇక తిరుగుండదు. మంచి బౌలర్లే ఉన్నప్పటికీ డ్యూ ఫ్యాక్టర్‌ వారికి చేటు చేసింది. సిరాజ్‌ (Mohammed Siraj) 4 ఓవర్లలో 59 పరుగులిచ్చి 2 వికెట్లే తీశాడు. ఆకాశ్‌ దీప్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌ (Harshal Patel) ఎకానమీ మరీ ఎక్కువగా ఉంది. వీరంతా టైట్‌ లైన్స్‌లో బౌలింగ్‌ చేస్తే గెలుపు బాట పట్టొచ్చు.

DY Patilలో టాసే కీలకం

డీవై పాటిల్‌ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. మొదటి ఐదు ఓవర్లు వికెట్‌ పోకుండా ఆడితే తర్వాత పరుగుల వరద పారించొచ్చు. ఇక్కడి బౌండరీలు చిన్నవి. బాల్‌ బ్యాటు మీదకు వస్తోంది. రెండో బ్యాటింగ్‌ మరింత ఈజీగా ఉంటోంది. అయితే బౌలర్లు లైట్‌ లైన్స్‌లో వేస్తే పరుగులను నియంత్రించొచ్చు.

23:20 PM (IST)  •  30 Mar 2022

డీకే విన్నింగ్‌ షాట్‌: బెంగళూరు 3 వికెట్ల తేడాతో విజయం

RCB vs KKR, IPL 2022 Live Updates: రసెల్‌ వేసిన తొలి బంతిని డీకే (14) సిక్సర్‌ కొట్టాడు. దాంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత బౌండరీ కొట్టి బెంగళూరుకు తొలి విజయం అందించాడు. హర్షల్‌ పటేల్‌ (10) అజేయంగా నిలిచాడు.

23:16 PM (IST)  •  30 Mar 2022

19 ఓవర్లకు బెంగళూరు 122-7

RCB vs KKR, IPL 2022 Live Updates: వెంకటేశ్‌ అయ్యర్‌ 10 పరుగులు ఇచ్చాడు. హర్షల్‌ పటేల్ (10) రెండు బౌండరీలు బాదాడు. డీకే (4) అతడికి తోడుగా ఉన్నాడు.

23:10 PM (IST)  •  30 Mar 2022

18 ఓవర్లకు బెంగళూరు 112-7

RCB vs KKR, IPL 2022 Live Updates: టిమ్‌ సౌథీ ఈ ఓవర్లో 2 వికెట్లు తీసి 7 పరుగులు ఇచ్చాడు. డీకే (3), హర్షల్‌ (1) క్రీజులో ఉన్నారు.

23:01 PM (IST)  •  30 Mar 2022

17 ఓవర్లకు బెంగళూరు 105-5

RCB vs KKR, IPL 2022 Live Updates: నరైన్‌ 4 పరుగులు ఇచ్చాడు. రూథర్‌ఫర్డ్‌ (28), డీకే (2) రిస్క్‌ తీసుకోలేదు.

22:56 PM (IST)  •  30 Mar 2022

16 ఓవర్లకు బెంగళూరు 101-5

RCB vs KKR, IPL 2022 Live Updates: చక్రవర్తి 8 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. ఐదో బంతికి సిక్సర్‌ కొట్టిన షాబాజ్‌ (27) ఆరో బంతికి స్టంపౌట్‌ అయ్యాడు. రూథర్‌ఫర్డ్‌ (26), దినేశ్‌ కార్తీక్‌ (౦) క్రీజులో ఉన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget