అన్వేషించండి

MI vs KKR:ముంబై ఖేల్‌ను కోల్‌కతా ఖతం చేస్తుందా..?

IPL 2024: వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు లేకుండా చేసుకున్న ముంబైతో .. తిరుగులేని నెట్ రన్‌రేట్‌తో  పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది.

MI vs KKR Match Preview: పాయింట్ల పట్టికలో టాప్‌లో రెండో స్థానంలో ఉన్నది ఒకరు... అదే పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉన్నది మరొకరు. ఒకరు ఓడితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మరో టీం ఓడితే మాత్రం అంతా అస్సామే. ఆ రెండు జట్లే ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. ఇందులో ముంబై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. కేకేఆర్‌ సెకండ్‌ ప్లేస్‌లో కుర్చీ వేసుకొని కూర్చుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి. 

కోల్‌కతాపై  ముంబై తిరుగులేని ఆధిపత్యం... కానీ ఇప్పుడు..?

ఇప్పటి వరకూ ఐపీఎల్‌ చరిత్రలో ఈ రెండు టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లు వాటి ఫలితాలను గమనిస్తే ముంబై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  ఈ రెండు జట్లూ 31 సార్లు తలపడగా.. ముంబై 23 సార్లు గెలవగా తొమ్మిది సార్లు కేకేఆర్ గెలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది.  ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన పది మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లు నెగ్గిన ముంబై  పాయింట్ల పట్టికలో అడుగు నుంచి రెండో స్థానం అంటే తొమ్మిదో స్థానానికే పరిమితమైంది. కోల్‌కతా పరిస్థితి ఐపీఎల్‌లో ఎప్పుడూ లేనంత పాజిటివ్ గా ఈ సీజన్‌లో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరింటిని గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. 

స్టార్లు అంచనాలు అందుకోలేదు.. 

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్య వంటి స్టార్లు ముంబై జట్టులో ఉన్నా.. వారు ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. ముంబై విషయంలో హర్షించదగ్గ విషయమేంటంటే జస్ప్రీత్ బుమ్రా మాత్రం బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బొమ్మను చూపెడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో అత్యదిక వికెట్లు తీసుకున్న ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. 

200+ అంత సులువా..? 

200కు పైగా స్కోర్లు చేయడం ఎంత సులువో ఈ సీజన్‌లో కేకేఆర్ చూపించింది.  ఫిల్ సాల్ట్, సునిల్ నరైన్, రింకూ సింగ్ వంటి ప్లేయర్లు బ్యాట్ ఝుళిపించడంతో ఆ జట్టు అయిదు సార్లు 200కు పైగా స్కోర్లు సాధించింది. రస్సెల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు బోలింగ్లో కీలకంగా వ్యవహరించడం సైతం జట్టు విజయాలకు బాటలు వేసింది. 

టాప్‌ స్కోర్‌లు ఇవే.. 

  • కోల్‌కతా - ముంబై మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్కోరు  232/2. ఈ టోటల్ కేకేఆర్ 2019 సీజన్‌లో చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
  • కోల్‌కతా - ముంబై మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు 60 బంతుల్లో 109 పరుగులు.  2012 సీజన్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఎం.ఐ ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ను 27 పరుగుల తేడాతో ఓడించింది. 
  • కేకేఆర్ తరఫున 2023లో వెంకటేశ్వర్ అయ్యర్ 104 పరుగులు చేశాడు.  ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయినా వెంకటేశ్వర్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. 
  • ఇక బౌలర్ల విషయానికొస్తే kkr-mi మ్యాచ్‌లలో బుమ్రా తీసిన 5/10 టాప్ కాగా... రస్సెల్ 5/15, నరైన్ 4/15 ఆ తరువాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.

అంచనా..

గతంలో ఈ రెండు జట్ల ప్రదర్శనలు ఎలా ఉన్నా.. ఈ సీజన్‌లో మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ కంటే కచ్చితంగా బలంగా ఉందనే చెప్పాలి. స్ట్రాంగ్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్, ఆటగాళ్ల ఫామ్ వంటి అంశాలను బేరీజు వేసుకుంటే ఈ సారి ముంబైకి అంత ఈజీ కాదనే అంచనా వేస్తున్నారు. మరోవైపు 261, 223 వంటి భారీ స్కోర్లు చేసి కూడా కేకేఆర్ ఈ సీజన్‌లో ఓటమి పాలైంది.  ఈ మ్యాచ్‌లో గనుక ముంబై ఓడిపోతే ఇక ఇంటికే.  గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబయి సర్వశక్తులూ ఒడ్డుతుంది కనుక వాంఖడేలో  భారీ స్కొర్లు నమోదై మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget