అన్వేషించండి

LSG vs RCB, IPL 2022 LIVE: సెకండ్‌ ప్లేస్‌కు బెంగళూరు : లక్నోపై 'సూపర్‌' విక్టరీ

LSG vs RCB live updates: ఐపీఎల్‌ 2022లో 31వ మ్యాచులో నేడు లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow supergiants), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి.

LIVE

Key Events
LSG vs RCB, IPL 2022 LIVE: సెకండ్‌ ప్లేస్‌కు బెంగళూరు : లక్నోపై 'సూపర్‌' విక్టరీ

Background

IPL 2022, lsg vs rcb preview lucknow supergiants vs royal challengers bangalore head to head records: ఐపీఎల్‌ 2022లో 31వ మ్యాచులో నేడు లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow supergiants), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. డీవై పాటిల్‌ మైదానం (DY Patil Stadium) ఇందుకు వేదిక. రాహుల్‌ సేన కంప్లీట్‌ డెప్త్‌తో జోష్‌లో ఉంది. మరోవైపు దినేశ్‌ కార్తీక్‌ ఫినిషింగ్‌ టచ్‌తో బెంగళూరు గట్టిపోటీనిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరెవరు ఉంటారు? ఎవరితో ఎవరికి ముప్పు?

ఈ సీజన్లో లక్నో (LSG), బెంగళూరు (RCB) చెరో 6 మ్యాచులు ఆడాయి. 4 గెలిచి 8 పాయింట్లతో ఉన్నాయి. నెట్‌ రన్‌రేట్‌ మాత్రమే ఇద్దరికీ తేడా! లక్నోతో పోలిస్తే బెంగళూరు బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. డుప్లెసిస్‌ (Faf Du Plessis), అనుజ్‌ రావత్‌ ఓపెనింగ్ భాగస్వామ్యాలు బాగాలేవు. వన్‌డౌన్‌లో వస్తున్న విరాట్‌ కోహ్లీ (Virat kohli) హఠాత్తుగా ఔటైపోతున్నాడు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (Glenn Maxwell), దినేశ్‌ కార్తీక్‌ (Dinesh Karthik) ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తూ విజయాలు అందిస్తున్నారు. షాబాజ్‌ అహ్మద్ సైతం అద్భుతంగా ఆడుతున్నాడు.

మరోవైపు లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటింగ్‌ యూనిట్‌ సూపర్‌ ఫామ్‌లో ఉంది. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), క్వింటన్‌ డికాక్‌ (Quinton Decock) ఓపెనింగ్‌కు తిరుగులేదు. వన్‌డౌన్లో వస్తున్న మనీశ్ పాండే (Manish Panday) ముంబయి మ్యాచుతో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఎవిన్‌ లూయిస్‌, కృష్ణప్ప గౌతమ్‌ సైతం ఫర్వాలేదు. మార్కస్‌ స్టాయినిస్‌ (Marcuk Stoinis) రావడంతో బౌలింగ్‌ మరింత బలపడింది. ఈ రెండు జట్ల పోటీలో కొన్ని మ్యాచ్‌అప్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి.

* దినేశ్ కార్తీక్‌ను ఆపడం ఎవరికీ సాధ్యమవ్వడం లేదు. పేస్‌లో బీభత్సమైన హిట్టింగ్‌ చేస్తున్న అతడు రిస్ట్‌స్పిన్‌లో మాత్రం కాస్త తడబడుతున్నాడు. రవి బిష్ణోయ్‌ (Ravi Bishnoi)తో అతడికి కచ్చితంగా ప్రమాదం ఉంది. 2020 నుంచి రైటార్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో 47 బంతులాడిని డీకే 42 పరుగులే చేశాడు. బిష్ణోయ్‌ వేసిన 20 బంతుల్లో 25 పరుగులే చేశాడు.

 

 

* ముంబయి తర్వాత కేఎల్‌ రాహుల్‌ ఎక్కువగా ఎంజాయ్ చేసేది బెంగళూరుపైనే! అయితే మాక్స్‌వెల్‌తో అతడికి ప్రమాదం పొంచివుంది. 4 ఇన్నింగ్సుల్లో 18 బంతులు ఆడిన కేఎల్‌ కేవలం 20 పరుగులు చేసి రెండుసార్లు ఔటయ్యాడు.

* ఐపీఎల్‌ 2022 పవర్‌ప్లేలో ఈ రెండు జట్లు ఎక్కువ ఎకానమీతో బౌలింగ్‌ చేస్తున్నాయి. లక్నో 8.61, బెంగళూరు 7.86 ఎకనామీతో పరుగులు ఇస్తున్నాయి.

* లక్నో బౌలింగ్‌లో అవేశ్‌ ఖాన్‌ (Avesh Khan) మళ్లీ కీలకం కానున్నాడు. 2022 ఐపీఎల్‌లో పవర్‌ప్లే, డెత్‌ ఓవర్లలో చెరో 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌ బౌలర్‌ నటరాజన్‌కు మాత్రమే ఈ రికార్డు సొంతమైంది.

LSG vs RCB Probable Playing XI

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG Playing xi): కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డికాక్‌, మనీశ్‌ పాండే, అయుష్‌ బదోనీ, మార్కస్‌ స్టాయినిస్‌, దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య, జేసన్‌ హోల్డర్‌, దుష్మంత చమీరా, అవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB Playing xi): డుప్లెసిస్‌, అనుజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లీ, మాక్స్‌వెల్‌, ప్రభుదేశాయ్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌

23:32 PM (IST)  •  19 Apr 2022

LSG vs RCB, IPL 2022 LIVE: 20 ఓవర్లకు లక్నో 163-8

ఆఖరి ఓవర్లో హర్షల్‌ పటేల్‌ 12 పరుగులు ఇచ్చి హోల్డర్‌ (16)ను ఔట్‌ చేశాడు. బిష్ణోయ్‌ (0), చమీరా (1) అజేయంగా నిలిచారు. బెంగళూరు 18 పరుగుల తేడాతో గెలిచింది.

23:26 PM (IST)  •  19 Apr 2022

LSG vs RCB, IPL 2022 LIVE: 19 ఓవర్లకు లక్నో 151-7

హేజిల్‌వుడ్‌ సూపర్‌ బౌలింగ చేశాడు. 3 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. రెండో బంతికి స్టాయినిస్‌ (24)ను ఔట్‌ చేశాడు. హోల్డర్‌ (3), చమీరా (2) క్రీజులో ఉన్నారు.

23:20 PM (IST)  •  19 Apr 2022

LSG vs RCB, IPL 2022 LIVE: 18 ఓవర్లకు లక్నో 148-6

హర్షల్‌ 10 పరుగులు ఇచ్చాడు. స్టాయినిస్‌ (24) ఒక బౌండరీ బాదాడు. హోల్డర్‌ (3) అతడికి తోడుగా ఉన్నాడు.

23:15 PM (IST)  •  19 Apr 2022

LSG vs RCB, IPL 2022 LIVE: 17 ఓవర్లకు లక్నో 138-6

హేజిల్‌వుడ్‌ 10 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. ఆయుష్‌ బదోనీ (13) ఔటయ్యాడు. స్టాయినిస్‌ (17), హోల్డర్‌ (1) నిలకడగా ఆడుతున్నారు.

23:06 PM (IST)  •  19 Apr 2022

LSG vs RCB, IPL 2022 LIVE: 16 ఓవర్లకు లక్నో 128-5

హసరంగ 11 పరుగులు ఇచ్చాడు. బదోనీ (11) నిలకడగా ఆడాడు. ఐదో బంతిని స్టాయినిస్‌ (11) సిక్సర్‌గా మలిచాడు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Dmart Stocks, Avenue Supermarts share price highlights: అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget