IPL 2024: రాణించిన కోల్‌కత్తా బౌలర్లు, 153 పరుగులకే పరిమితమైన ఢిల్లీ
KKR vs DC, IPL 2024: కోల్‌కత్తా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ బ్యాటర్ల ఆటలు సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
KKR vs DC IPL 2024 Kolkata Knight Riders 154: కోల్‌కత్తా(KKR)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) తక్కువ పరుగులకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కోల్‌కత్తా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ బ్యాటర్ల ఆటలు సాగలేదు. కోల్‌కత్తా బౌలర్లు అందరూ ఒక్క వికెట్ అయినా తీశారు. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఢిల్లీ బ్యాటర్లలో కుల్‌దీప్ ఒక్కడే 30 పరుగుల మార్క్‌ను దాటడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ రిషబ్ పంత్ 27 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కుల్‌దీప్ యాదవ్ ఢిల్లీ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో కుల్‌దీప్ యాదవ్ ఢిల్లీని ఆదుకున్నాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సుతో 34 పరుగులు చేసి ఢిల్లీ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ పూర్తి ఓవర్లు ఆడగలిగింది. కుల్‌దీప్ పోరాటంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
మెరిసిన బౌలర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని కోల్‌కత్తా బౌలర్లు వణికించారు. 17 పరుగుల వద్ద మొదలైన ఢిల్లీ బ్యాటర్ల పతనం చివరి వరకూ కొనసాగింది. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద 7 బంతుల్లో మూడు ఫోర్లతో 13 పరుగులు చేసిన పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. పృథ్వీ షాను వైభవ్ అరోరా అవుట్ చేసి ఢిల్లీకి తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఈ ఐపీఎల్ సీజన్‌లో మెరుపులు మెరిపిస్తున్న జాక్ ఫ్రేజర్ మెక్ గర్క్ కూడా అవుట్ కావడంతో ఢిల్లీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. 7 బంతుల్లో ఒక ఫోర‌్, ఒక సిక్స్‌తో 12 పరుగులు చేసిన మెక్‌గర్క్‌ను స్టార్క్ అవుట్ చేశాడు. దీంతో 30 పరుగులకే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా పంత్ సేన కష్టాలు కొనసాగాయి.
37 పరుగుల వద్ద ఢిల్లీ మరో వికెట్ కోల్పోయింది. 3 బంతుల్లో ఆరు పరుగులు చేసిన షాయ్ హోప్ కూడా పెవిలియన్ చేరాడు. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. మరింత కష్టాల్లో పడింది. అయితే రిషబ్ పంత్... అభిషేక్ పోరెల్ ఢిల్లీని ఆదుకునే ప్రయత్నం చేశార. కానీ కోల్‌కత్తా బౌలర్లు పట్టు వదల్లేదు. 15 బంతుల్లో 18 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్‌ను హర్షిత్ రాణా అవుట్ చేయగా....కుమార కుషగర ఇలా వచ్చి ఒకే పరుగు చేసి అలా పెవిలియన్‌కు చేరాడు. రిషభ్‌పంత్ కూడా 27 పరుగులు చేసి అవుట్ కావడంతో ఢిల్లీ 93 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత స్కోరు బోర్డుపై మరో పది పరుగులైనా చేరకుండానే స్టబ్స్... అక్షర్ పటేల్ కూడా అవుటయ్యారు. కానీ చివర్లో కుల్‌దీప్ యాదవ్ ఢిల్లీని ఆదుకున్నాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సుతో 34 పరుగులు చేసి ఢిల్లీ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ పూర్తి ఓవర్లు ఆడగలిగింది. కుల్‌దీప్ పోరాటంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.