అన్వేషించండి

CSK Playoff Qualify Chances: చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ప్లేఆఫ్లకు ఎలా చేరుకుంటుందో తెలుసుకోండి, CSK యొక్క అన్ని సమీకరణాలు తెలుసుకోండి

CSK Playoff Chances: CSK ఆడిన 13 మ్యాచ్‌లలో 7 ఓడిపోగా.. చివరి మ్యాచ్ గెలిచినా అంత ఈజగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేదు. అందుకు కొన్ని ఈక్వేషన్లు కలిసిరావాలి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్ చేతిలో చెన్నై ఓటమి, ప్లేఆఫ్ అవకాశాలు తగ్గాయి.
  • హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరాయి, ఇంకో స్థానం మిగిలింది.
  • రాజస్థాన్, పంజాబ్, కోల్‌కతా ఓడితే చెన్నైకి అవకాశాలుంటాయి.
  • చెన్నై చివరి మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది.

IPL 2026 Playoff Teams List | చెన్నై సూపర్ కింగ్స్ IPL 2026 ప్లేఆఫ్‌లకు క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో సొంత వేదికలో ఓడిపోవడం సీఎస్కే జట్టుకు మైనస్ పాయింట్ అయింది. అయినా ప్లేఆఫ్స్ చేరేందుకు చెన్నై జట్టుకు ఇంకా అవకాశం ఉంది. సోమవారం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఎస్కేను 5 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ జట్టులో వన్‌డౌన్ బ్యాటర్ఇషాన్ కిషన్ 70 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో చెన్నై  ప్లేఆఫ్‌ అవకాశాలు చాలా వరకు దెబ్బతిన్నా అవకాశాలు ఉన్నాయి. .

చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)పై విజయం సాధించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. SRH విజయంతో మరో జట్టు గుజరాత్ టైటాన్స్‌కు కూడా ప్లే ఆఫ్స్ చేరింది. అంటే మైదరాబాద్ టీం తాము ప్లేఆఫ్స్ చేరడంతో పాటు జీటీకి కూడా ప్లస్ చేసింది. పాయింట్స్ టేబుల్‌లో GT రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ, సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరగా మరో స్థానం మిగిలి ఉంది. నాలుగో బెర్త్ కోసం CSKతో సహా 5 జట్లు రేసులో ఉన్నాయి. చెన్నై జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి ఉన్న అవకాశాలు ఇలా ఉన్నాయి. 

Also Read: Sanju Samson VS MS Dhoni: సంజు శాంసన్ సరికొత్త రికార్డు - ఎంఎస్ ధోని ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే వికెట్ కీపర్

2 మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ రాయల్స్ ఓడాలి

RCB, GT, SRH జట్ల తర్వాత పాయింట్స్ టేబుల్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) నాల్గవ జట్టుగా ఉంది. రాజస్తాన్ సైతం 16 పాయింట్లకు చేరుకునే వీలుంది. రాజస్థాన్ ఒక మ్యాచ్ మే 19న లక్నోతో ఉంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ గెలిస్తే చెన్నై దాదాపుగా ఈ ఐపీఎల్ లీగ్ స్టేజీ నుంచి ఇంటిదారి పట్టినట్లే. రాజస్థాన్ రెండవ మ్యాచ్ ముంబైతో ఆడనుంది. రాజస్థాన్ రెండు మ్యాచ్‌లు గెలిస్తే చెన్నై కచ్చితంగా ప్లేఆఫ్ రేసు నుండి తప్పుకుంటుంది.

పంజాబ్, కోల్‌కతా జట్లు ఓడిపోవాలి

చెన్నై సూపర్ కింగ్స్ (CSK),  కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 2 మ్యాచ్‌లలో ఒక మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది. కోల్‌కతా టీం బుధవారం MIతో ఒక మ్యాచ్, ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో రెండవ మ్యాచ్ ఆడనుంది. పంజాబ్ చివరి మ్యాచ్ లక్నోతో శనివారం ఆడుతుంది. పంజాబ్ కూడా తన చివరి మ్యాచ్‌లో ఓడిపోతేనే చెన్నైకి అవకాశాలు సజీవంగా ఉంటాయి. 

Read Also: Vaibhav Sooryavanshi Breaks Abhishek Sharma's Record: వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు - అభిషేక్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన టీనేజ‌ర్

చివరి మ్యాచ్‌లో చెన్నై కచ్చితంగా నెగ్గాలి

పైన పేర్కొన్న అన్ని సమీకరణాలు జరిగితే, ఆపై చెన్నై జట్టు తమ చివరి మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌తో గెలిస్తే CSK ప్లేఆఫ్‌లకు చేరుకుంటుంది. చెన్నై చివరి మ్యాచ్ మే 21న గుజరాత్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉంది.

CSK ప్లేఆఫ్‌లకు చేరుకనేందుకు అవకాశాలివే..

-  రాజస్థాన్ రాయల్స్ తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి

- పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి   

-  కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక మ్యాచ్‌లో ఓడిపోవాలి

Frequently Asked Questions

చెన్నై సూపర్ కింగ్స్ IPL 2026 ప్లేఆఫ్‌లకు క్వాలిఫై అవ్వడానికి గల అవకాశాలు ఏమిటి?

రాజస్థాన్ రాయల్స్ తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తమ మ్యాచ్‌లలో ఓడిపోవాలి. చివరగా, చెన్నై తమ చివరి మ్యాచ్‌లో గెలవాలి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం ఏ జట్లకు ప్లేఆఫ్‌లలో సహాయపడింది?

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయం సాధించడంతో వారు ప్లేఆఫ్‌లకు అర్హత సాధించారు. దీనితో పాటు గుజరాత్ టైటాన్స్ (GT) కూడా ప్లేఆఫ్‌లకు చేరుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌లకు చేరిందా?

అవును, చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది.

నాలుగో ప్లేఆఫ్‌ బెర్త్ కోసం ఏ జట్లు పోటీలో ఉన్నాయి?

ఆర్సీబీ, సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరగా, నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్‌తో సహా 5 జట్లు పోటీలో ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Embed widget