IPL 2026 Controversy: క్లోజ్ ఫినిష్‌లో వివాదాస్పద రూల్ - ఢిల్లీ విజయానికి అడ్డుపడిన అంపైర్ డెసిషన్! క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్!
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల రద్దయిన ఆ ఒక్క పరుగు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

IPL 2026 Controversy DC VS GT Updates: ఐపీఎల్ 2026 సీజన్‌లో బుధవారం జరిగిన గుజరాత్ టైటాన్స్ (GT), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చకు తెరలేపింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన సమయంలో కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి పాలైంది. అంతకుముందు బంతికి డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయడానికి నిరాకరించడం కూడా జట్టు కొంపముంచింది. అయితే, ఈ ఓటమి కంటే కూడా మ్యాచ్ మధ్యలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంపైర్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఢిల్లీకి రావాల్సిన ఒక పరుగు రాకుండా పోవడమే దీనికి కారణం.
At 9.2 overs, Nitish Rana completed a single, but the run wasn’t counted because the umpire had initially given him out, even though DRS later overturned the decision in his favour.
— Sadha (@sadha2525) April 9, 2026
DC eventually lost the game by 1 run 🙂@ashwinravi99 what do you think of this rule, someone… pic.twitter.com/6RufRJubVa
ఏం జరిగింది? ఆ వివాదం ఏంటి?
ఢిల్లీ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో నితీష్ రాణా ప్యాడ్లకు బంతి తగిలింది. అంపైర్ ఎల్బీడబ్ల్యూ (LBW) గా భావించి వేలు పైకెత్తారు. అంపైర్ నిర్ణయం రాకముందే బ్యాటర్లు ఒక పరుగు పూర్తి చేశారు. నితీష్ రాణా వెంటనే రివ్యూ తీసుకోగా, థర్డ్ అంపైర్ అది నాటౌట్ అని ప్రకటించారు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు కానీ, బ్యాటర్లు తీసిన ఆ ఒక్క పరుగును మాత్రం స్కోరు బోర్డులో చేర్చలేదు. ఎంసీసీ (MCC) క్రికెట్ చట్టాల ప్రకారం అంపైర్ అవుట్ అని ప్రకటించగానే ఆ బంతి 'డెడ్ బాల్' (Dead Ball) గా మారుతుంది.
క్రికెట్ రూల్స్ ఏమని చెబుతున్నాయి?
ఎంసీసీ లా 20.1.1.3 ప్రకారం, ఒక బ్యాటర్ అవుట్ అయిన వెంటనే ఆ బంతి డెడ్ అయినట్లు పరిగణిస్తారు. అవుట్ కావడానికి కారణమైన సంఘటన జరిగిన క్షణం నుండే ఆ బంతి ప్లేలో లేనట్లు లెక్క. లా 20.6 ప్రకారం, ఒకవేళ తర్వాత థర్డ్ అంపైర్ ఆ నిర్ణయాన్ని తప్పు అని తేల్చినా, అప్పటికే డెడ్ అయిన ఆ బంతిని మళ్ళీ ప్లేలోకి తీసుకురాలేరు. అంటే, అంపైర్ పొరపాటున అవుట్ ఇచ్చినా సరే, ఆ బంతిపై బ్యాటర్లు సాధించిన పరుగులు లెక్కలోకి రావు. ఒకవేళ అది బౌండరీ వెళ్లినా కూడా దానిని రద్దు చేస్తారు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం..
ఢిల్లీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో ఈ రూల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అంపైర్ చేసిన తప్పుకు ఢిల్లీ జట్టు భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు. అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటికి శిక్ష జట్లు ఎందుకు అనుభవించాలని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆధునిక క్రికెట్‌లో టెక్నాలజీ ఇంతగా అందుబాటులో ఉన్నా కూడా, ఇలాంటి నిబంధనల వల్ల మ్యాచ్ ఫలితాలు మారిపోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఒక్క పరుగుతో మ్యాచ్ ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ డెడ్ బాల్ రూల్ ఒక పీడకలలా మిగిలిపోయింది. ఈ విషయంలో ఐసీసీ (ICC) పునరాలోచించాలని క్రికెట్ ప్రేమికులు కోరుతున్నారు.
Before You Go
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్ నుంచి బుమ్రా అవుట్
ట్రెండింగ్ వార్తలు



















