అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

IPL 2024: ఇద్దరిదీ ఒకే కథ, పైచేయి సాధించేదెవరు ?

PBKS vs MI : పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో పంజాబ్‌ , ఎనిమిదో స్థానంలో ఉన్న ముంబై తో తలపడనుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రెండు జట్లు.. తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

 PBKS vs MI Preview and Prediction : ఈ ఐపీఎల్‌(IPL)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రెండు జట్లు.. తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌(PBKS).... ఎనిమిదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌(MI)తో తలపడనుంది. రెండు జట్లు నాలుగేసి పాయింట్లతో సమానంగా ఉన్న ముంబై కంటే రన్‌రేట్‌ పరంగా పంజాప్‌పైన ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటివరకూ ఆరు మ్యాచులు ఆడిన ముంబై- పంజాబ్‌.. నాలుగు పరాజయాలు.. రెండు గెలుపులతో సమఉజ్జీలుగా ఉన్నాయి. గత మ్యాచులో రెండు జట్లు పరాజయం పాలవ్వడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. 
 
పంజాబ్‌ పుంజుకునేనా..?
భుజం గాయం కారణంగా పది రోజుల పాటు జట్టుకు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. టాప్‌ ఆర్డర్‌లో పంజాబ్‌ కష్టాలు కొనసాగుతున్న వేళ ఈ మ్యాచ్‌లో ధావన్‌ కీలకంగా మారనున్నాడు. భారత దేశీయ ఆటగాళ్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు రాణిస్తుండడం పంజాబ్‌కు కాస్త ఊరట కలిగిస్తోంది. వీరిద్దరూ క్రీజులో నిలబడి పరుగులు సాధిస్తుండడంతో పంజాబ్‌ బ్యాటింగ్‌ లోపాలు బహిర్గతం కావడం లేదు. ఆరు మ్యాచ్‌ల్లో 19.83 సగటుతో కేవలం 119 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఫామ్ పంజాబ్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. జితేష్ శర్మ కూడా వరుసగా విఫలమవుతుండడం పంజాబ్‌కు తలనొప్పిగా మారింది. ఆరు మ్యాచుల్లో 17.66 సగటుతో జితేశ్‌ కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపికవుతాడని ఆశించిన జితేష్‌ వరుసగా విఫలమవుతుండడం పంజాబ్‌ను నిరాశ పరుస్తోంది. ఆరు మ్యాచుల్లో 126 పరుగులు చేసి 8 వికెట్లు తీసిన శామ్ కరణ్‌... 9 వికెట్లు తీసిన కగిసో రబాడకు ఇతర ఆటగాళ్ల నుంచి మరింత మద్దతు అవసరం. అర్ష్‌దీప్ సింగ్ 9, హర్షల్ పటేల్ 7 వికెట్లు తీసి ఈ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్నారు.
 
ముంబై ఏంచేస్తుందో..
అరివీర భయంకర జట్టుగా పేరున్న ముంబై ఈ ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతోంది. ముంబై జట్టులో విధ్వంసకర బ్యాటర్లు చాలామంది ఉన్నారు. కానీ వారికి తగిన మద్దతే లభించడం లేదు. బౌలింగ్‌లో వైఫల్యం ముంబైను వెంటాడుతోంది. బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు విఫవమవుతున్నారు. రోహిత్ శర్మ సెంచరీ చేసినా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. ఐదుసార్లు విజేతలైన ముంబై ఈ ఐపీఎల్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోతోంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ ఎకానమీ 12గా ఉండడం ముంబై బౌలింగ్‌ కష్టాలను చూపుతోంది. పాండ్యా కంటే అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్‌ ఆకాష్ మధ్వల్ తక్కువ పరుగులు ఇస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, రోహిత్, ఇషాన్ కిషన్ నిలబడితే పంజాబ్‌ బౌలర్లకు కష్టాలు తప్పవు.
 
పంజాబ్‌ జట్టు:  శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్. 
 
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్ (వికెట్), అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
Embed widget