అన్వేషించండి

IPL 2024: గుజరాత్‌-ఢిల్లీ మ్యాచ్‌, లోపాలను దిద్దుకుంటారా?

GT vs DC : పాయింట్ల పట్టికలో ఆరు స్థానంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌తో...తొమ్మిదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

IPL 2024 GT vs DC Preview and Prediction : ఐపీఎల్‌(IPL)లో మరో కీలక మ్యాచ్‌కు రెండు జట్లు సిద్ధమయ్యాయి. పాయింట్ల పట్టికలో ఆరు స్థానంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో...తొమ్మిదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు అడిన గుజరాత్‌ మూడు విజయాలు, మూడు పరాజయాలతో ఆరు స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లే ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కేవలం రెండు మ్యాచుల్లో విజయం సాధించి..నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ రేసులో మరింత ముందుకు వెళ్లాలని గుజరాత్‌ భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలని ఢిల్లీ జట్టు పట్టుదలగా ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి విజయం సాధించిన గుజరాత్‌.. ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది.

లోపాలను సరిదిద్దుకుంటేనే..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టాలని చూస్తోంది. విజయాలు సాధిస్తున్నా టైటాన్స్ ఇంకా పూర్తిగా గాడినపడినట్లు కనిపించడం లేదు. రాజస్థాన్ రాయల్స్‌పై చివరి బంతికి విజయం సాధించడం టైటాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. మరోవైపు ఢిల్లీ మొదటి ఆరు మ్యాచుల్లో కేవలం కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. లీగ్‌ల్లో ఇంకో ఎనిమిది మ్యాచ్‌లు మిగిలి ఉన్న వేళ ఇరు జట్లు లోపాలను సవరించుకుని గాడిన పడాలని చూస్తున్నాయి. మహ్మద్ షమీ లేకపోవడం గుజరాత్‌ బౌలింగ్ విభాగాన్ని ఆందోళన పరుస్తోంది. ఉమేష్ యాదవ్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు ఇచ్చేస్తుండడం గుజరాత్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ కూడా అంచనాలను అందుకోలేకపోతున్నారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ గుజరాత్‌ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా మారాడు. రషీద్‌ బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి బౌండరీ కొట్టి గుజరాత్‌కు కీలకమైన విజయాన్ని అందించాడు. 

ఢిల్లీ జట్టులో కష్టాలు
ఫామ్, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవన్‌ని ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం ఢిల్లీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. కానీ ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరాలంటే జట్టులో ఇంకా సమతుల్యత రావాల్సి ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న కుల్‌దీప్‌ యాదవ్‌ మరోసారి కీలకంగా మారనున్నాడు. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన మెక్‌గుర్క్‌పై ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది. ఢిల్లీ బౌలింగ్‌ కూడా కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. ముఖేష్ కుమార్ గత అయిదు మ్యాచుల్లో ఓవర్‌కు 10 పరుగులు ఇచ్చాడు. కెప్టెన్ రిషబ్ పంత్ మెరుగ్గా రాణిస్తుండడం ఆ జట్టుకు బలంగా మారింది. డేవిడ్ వార్నర్ కూడా గాడినపడితే ఢిల్లీకి బ్యాటింగ్‌లో పెద్దగా ఇబ్బందులు ఉండవు. 

జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, స్పెన్సర్ జాన్సన్ , కార్తీక్ త్యాగి, జాషువా లిటిల్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, సందీప్ వారియర్, శరత్, మానవ్ సుతార్. 

ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యశ్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, ఝే రిచర్డ్‌సన్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Kondapochamma Sagar Dam: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
Three Gorges Dam in space: అంతరిక్షంలో త్రీ గోర్జెస్ డ్యామ్- మైండ్‌ బ్లోయింగ్‌ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న చైనా
అంతరిక్షంలో త్రీ గోర్జెస్ డ్యామ్- మైండ్‌ బ్లోయింగ్‌ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న చైనా
Embed widget