అన్వేషించండి

IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన

Gujarat Titans vs Delhi Capitals: గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు చెలరేగారు. ఈ దెబ్బకి గుజరాత్ 89 పరుగులకే ఆలౌటైంది.

Delhi Capitals won by 6 wkts: సొంత మైదానంలో గుజరాత్‌ టైటాన్స్‌(GT)కు ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) పీడకలను మిగిల్చింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. తొలుత బంతితో గుజరాత్ బ్యాటర్లను చుట్టేసిన ఢిల్లీ బౌలర్లు... తర్వాత బ్యాట్‌తో చెలరేగి ఘన విజయాన్ని అందించారు. తొలుత గుజరాత్‌ను 89 పరుగులకే ఢిల్లీ బౌలర్లు ఆలౌట్‌ చేయగా.. 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. ఈ పరాజయంతో గుజరాత్‌ రన్‌రేట్‌ దారుణంగా పడిపోయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీపైకి ఎగబాకింది. బ్యాటర్లు విఫలం కావడంతో 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఢిల్లీ కుప్పకూలింది.
 
కట్టడి చేసిన బౌలర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను... శుభ్‌మన్‌ గిల్, వృద్ధిమాన్ సాహా ప్రారంభించారు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదిన శుభ్‌మన్‌ గిల్.. తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ ఇషాంత్‌ శర్మ వేసిన రెండో ఓవర్‌లో ఐదో బంతికి పృథ్వీ షాకు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ అవుటయ్యాడు. ఎనిమిది పరుగులు చేసి శుభ్‌మన్ గిల్ పెవిలియన్‌ చేరాడు. కాసేపటికే గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసి వృద్ధిమాన్ సాహా ఔటయ్యాడు.ముకేశ్ కుమార్ వేసిన నాలుగో ఓవర్‌లో ఐదో బంతిని వికెట్ల మీదికి ఆడుకుని సాహా వెనుదిరిగాడు. దీంతో 4 ఓవర్లకు 28 పరుగులు చేసి గుజరాత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.  12 పరుగులు చేసిన సాయి సుదర్శన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 28 పరుగుల వద్దే గుజరాత్‌ మరో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కూడా గుజరాత్‌ వికెట్ల పతనం కొనసాగింది. పంత్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌కు డేవిడ్‌ మిల్లర్‌ అవుటయ్యాడు. ఇషాంత్ శర్మ వేసిన బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో గుజరాత్ 30 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. రిషభ్ పంత్‌ అద్భుతంగా డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకోవడంతో మిల్లర్ వెనుదిరిగాడు. ఖలీల్‌ అహ్మద్ ఆరో ఓవర్‌ను మెయిడిన్‌ చేశాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 30/4. ఈ సీజన్‌లో పవర్‌ ప్లే ముగిసే సరికి ఇదే రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం పంత్‌ మెరుపు స్టంపింగ్‌తో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. ట్రిస్టన్‌ స్టబ్స్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రిషభ్ పంత్ మెరుపు వేగంతో కీపింగ్‌ చేసి స్టంప్స్‌ను పడగొట్టడంతో అభినవ్‌ వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో పంత్ వికెట్ కీపింగ్‌లో అదరగొట్టాడు. స్టబ్స్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఐదో బంతికి షారూఖ్‌ ఖాన్‌ను మెరుపు వేగంతో పంత్‌ స్టంప్‌ ఔట్ చేశాడు. గుజరాత్ 48 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. అక్షర్ పటేల్ వేసిన 12 ఓవర్‌లో రెండో బంతికి రాహుల్ తెవాటియా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. గుజరాత్‌ బ్యాటర్లలో  రషీద్‌ ఖాన్‌ హైయ్యెస్ట్‌ స్కోరర్‌గా నిలిచాడు. 24 బంతుల్లో రషీద్‌ 31 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్‌ కుమార్ 3, ఇషాంత్‌ శర్మ 2, స్టబ్స్‌ 2, ఖలీల్‌ అహ్మద్‌,అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్ తీశారు. 
 
దూకుడుగా లక్ష్య ఛేధన
90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తొమ్మిది ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పృథ్వీ షా ఏడు పరుగులతో నిరాశ పరిచినా మెక్‌గుర్క్‌ 20, అభిషేక్‌ పోయెల్‌ 15, షాయ్‌ హోప్‌ 19 పర్వాలేదనిపించారు. చివర్లో కెప్టెన్ రిషబ్‌ పంత్‌  లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. లక్ష్యం మరీ చిన్నది కావడంతో గుజరాత్‌ బౌలర్లకు పోరాడే అవకాశం దక్కలేదు.

టాప్ హెడ్ లైన్స్

KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget