అన్వేషించండి

IPL 2024: మెరిసిన పంత్‌ - చెన్నై ముందు భారీ లక్ష్యం

DC vs CSK: గాయం నుంచి కోలుకున్న ఏడాదిన్నర తర్వాత ఐపీఎల్‌లో బరిలోకి దిగిన కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ మెరవడంతో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ 191 పరుగుల భారీ స్కోరు చేసింది.

IPL 2024  DC vs CSK Pants fifty takes Delhi Capitals to 191/5:  గాయం నుంచి కోలుకున్న ఏడాదిన్నర తర్వాత ఐపీఎల్‌(IPL)లో బరిలోకి దిగిన కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(Rishab pant) మెరవడంతో చెన్నై(CSK)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ(DC) 191 పరుగుల భారీ స్కోరు చేసింది. పృథ్వీ షా, వార్నర్, పంత్‌ మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

అదిరిన ఆరంభం
 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్ తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన ఈ ఇద్దరు బ్యాటర్లు... ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. తుషార్ దేశ్‌పాండే రెండో ఓవర్‌లో షా రెండు సిక్సర్లు కొట్టాడు.  డేవిడ్ వార్నర్‌ దూకుడుగా ఆడాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో మూడో బంతికి సిక్స్ బాదిన అతడు.. తర్వాతి రెండు బంతులను బౌండరీకి పంపాడు. ముస్తాఫిజుర్ రెహ్మన్ వేసిన ఆరో ఓవర్‌లో పృథ్వీ షా హ్యాట్రిక్ ఫోర్లు బాదేశాడు. ఇదే ఓవర్‌లో వార్నర్‌ కూడా ఓ బౌండరీ రాబట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి.

పవర్‌ ప్లే ముగిసేసరికి దిల్లీ 62/0 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉంది. డేవిడ్ వార్నర్ 32 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. 9 ఓవర్లకు స్కోరు 91 పరుగులకు చేరింది. డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. ముస్తాఫిజుర్‌ వేసిన ఓవర్‌లో మూడో బంతికి వార్నర్‌ రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడగా పతిరన గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టాడు. కాసేపటికే ఢిల్లీ మరో వికెట్ కోల్పోయింది. 27 బంతుల్లో 43 పరుగులు చేసిన పృథ్వీ షా ఔటయ్యాడు. జడేజా  ఓవర్‌లో  ధోనీకి క్యాచ్‌ ఇచ్చి షా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ పట్టడం ద్వారా ధోనీ టీ20ల్లో 300 డిస్మిసల్స్‌ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మతిశా పతిరన ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.  15 ఓవర్‌లో నాలుగో బంతికి మిచెల్ మార్ష్‌ (18), చివరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్‌ (0) ఔట్‌ చేశాడు . రిషభ్‌ పంత్ ఫామ్‌లోకి రావడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో పంత్‌ 51 పరుగులు చేసి ఔటయ్యాడు. పతిరన వేసిన 19 ఓవర్‌లో వరుసగా 6,4,4 బాది 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న పంత్.. తర్వాతి బంతికే రుతురాజ్‌ గైక్వాడ్‌కు చిక్కాడు. పృథ్వీ షా, వార్నర్, పంత్‌ మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటివరకూ మొత్తం 29 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 19 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్... చెన్నైపై పదిసార్లు గెలిచింది.  గత అయిదు మ్యాచుల్లో చెన్నైపై ఢిల్లీ కేవలం ఒకే విజయం సాధించగా.. చెన్నై నాలుగు సార్లు విజయం సాధించింది.  చెన్నైతో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఘోరంగా ఓడిపోయింది. 91, 27, 77 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ చెత్త రికార్డును చెరిపేసుకోవాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget