అన్వేషించండి

PBKS vs RCB, Match Highlights: పంజాబ్‌కు సిరాజ్ సెగ - కింగ్స్‌పై బెంగళూరు రాయల్ విక్టరీ!

ఐపీఎల్ 2023లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24 పరుగులతో విజయం సాధించింది.

IPL 2023, PBKS vs RCB: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మూడో విజయం లభించింది. మొహాలీలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (59: 47 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాఫ్ డుఫ్లెసిస్ (84: 56 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (46: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో జితేష్ శర్మ (41: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఎంత ప్రయత్నించినా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. దీంతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో పంజాబ్ వెన్ను విరిచాడు.

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్ అధర్వ థైడే (4: 2 బంతుల్లో, ఒక ఫోర్), వన్ డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (8: 7 బంతుల్లో, ఒక సిక్సర్), ఆ తర్వాత వచ్చిన లియాం లివింగ్ స్టోన్ (2: 4 బంతుల్లో) ఘోరంగా విఫలం అయ్యారు. వీరిలో అధర్వ థైడే, మాథ్యూ షార్ట్‌ల వికెట్లు మహ్మద్ సిరాజ్ దక్కించుకున్నాడు. ఈ రెండు వికెట్లకు సంబంధించిన అంపైర్ మొదట నాటౌట్ ఇచ్చాడు. కానీ రివ్యూకి వెళ్లి మరీ ఈ వికెట్లను తెచ్చుకోవడం విశేషం. లియాం లివింగ్ స్టోన్ వికెట్ హసరంగకు దక్కింది.

ఆ తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. కనీసం ఒక్క బలమైన భాగస్వామ్యాన్ని కూడా పంజాబ్ ఏర్పరచలేకపోయింది. ఎనిమిదో వికెట్‌కు జితేష్ శర్మ (41: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), హర్‌ప్రీత్ బ్రార్ (13: 13 బంతుల్లో, ఒక ఫోర్) జోడించిన 41 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. 18వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, 19వ ఓవర్లో హర్షల్ పటేల్ ఒక వికెట్ తీసుకోవడంతో పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. వనిందు హసరంగ రెండు వికెట్లు తీసుకున్నాడు. వేర్ పార్నెల్, హర్షల్ పటేల్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

టాస్‌ ఓడిన ఆర్సీబీకి అమేజింగ్‌ స్టార్ట్‌ ఇచ్చారు విరాట్‌ కోహ్లీ (59: 47 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), డుప్లెసిస్‌ (84: 56 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు)! మొదటి బంతి నుంచీ పాజిటివ్‌గా బ్యాటింగ్‌ చేశారు. పవర్‌ప్లేలో వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదేశారు. దాంతో బెంగళూరు 6 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 59 రన్స్‌ చేసింది. గాయపడ్డప్పటికీ డుప్లెసిస్‌ జోరు చూపించాడు. కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. జస్ట్‌ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దాంతో 70 బంతుల్లోనే ఆర్సీబీ 100కు చేరుకుంది. స్ట్రాటజిక్‌ టైమ్‌ఔట్‌ తర్వాత విరాట్‌ దూకుడుగా ఆడాడు. మొదటి నుంచీ డౌన్‌ ద గ్రౌండ్‌ వచ్చే షాట్లు బాదాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

కోహ్లీ, డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 98 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యం అందించారు. వరుస బంతుల్లో వికెట్లు పడటంతో ఆర్సీబీ స్కోరు నెమ్మదించింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన 16.1వ బంతికి విరాట్‌ కోహ్లీ లెగ్‌సైడ్‌ ఆడబోయి కీపర్‌ జితేశ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతినే భారీ షాట్‌ ఆడబోయిన మాక్స్‌వెల్‌ (0) టెయిడ్‌కు చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే నేథన్‌ ఎలిస్‌ బౌలింగులో డుప్లెసిస్‌ పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్‌ (7), మహిపాల్‌ లోమ్రర్‌ (7), షాబాజ్‌ అహ్మద్‌ (5) మెరుపులేమీ లేకపోవడంతో ఆర్సీబీ 174/4కు పరిమితం అయింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget