IPL 2022: కింగ్స్‌లో ఎవరిది పై చేయి? మయాంక్‌ను జడేజా అడ్డుకోగలడా?
PBKS vs CSK: రవీంద్ర జడేడా కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ కింగ్స్‌లో ఎవరు పైచేయి సాధించనున్నారు. ఐపీఎల్ 2022లో జరిగే 38వ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది.
యాక్టింగ్ కెప్టెన్‌గా ధోనీ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఇవాళ మయాంక్ అగర్వార్ కెప్టెన్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్(PBKS)తో తలపడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2022) 2022లో మరో ఆసక్తి మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించనుంది. తొమ్మిదో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌తో ఢీ కొట్టనుంది. వాంఖడే స్థేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఐపీఎల్ 2022లో 38వ మ్యాచ్.
ముంబైపై గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ మంచి జోష్ మీద ఉంది. పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని దిల్లీ క్యాపిటల్స్ (DC) చేతిలో ఘోరమైన ఓటమి చవి చూసింది. IPL 2022లో 8 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ 3 విజయాలు సాధించగా, జడేజా నేతృత్వంలోని సీఎస్‌కే(CSK)జట్టు కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది.
గత రికార్డులు చూస్తే పంజాబ్‌పై సీఎస్‌కే మంచి విజయాలే ఉన్నాయి. పంజాబ్‌పై చెన్నై 15 విజయాలు నమోదు చేయగా, పిబికెఎస్ జట్టు 11 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. డెత్ ఓవర్స్‌లో మంచి రన్‌రేట్ సాధించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా పంజాక్ ఆటగాళ్లకు ఉంది. కానీ ఈ సీజన్‌లో వారి సత్తా ఇంకా చూపలేకపోయారు. అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ స్పెషలిస్ట్‌లు కేవలం 18 వికెట్లు మాత్రమే తీశారు. 10 జట్లతో పోల్చుకంటే ఈ జట్టు పేసర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
IPL 2022లో 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సగటు 15.43 ఉంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ వైపు చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. మరో 59 పరుగులు చేస్తే శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో ఆరువేల పరుగులు... చెన్నైలో వెయ్యి పరుగుల రికార్డు అధిగమించనున్నాడు. చెన్నైపై శిఖర్ ధావన్‌కు మంచి రికార్డే ఉంది. మొత్తం 27 మ్యాచ్‌లు ఆడిన శిఖర్.. 41 కంటే ఎక్కువ సగటు కలిగి ఉన్నాడు.
శిఖర్‌తోపాటు స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా చెన్నైపై మరో రికార్డు సృష్టించనున్నాడు. చాహర్‌కు ఇది 50వ మ్యాచ్. చెన్నైపై చాహర్‌కి కూడా మంచి రికార్డు ఉంది. 5.8 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసి ఉన్నాడు.