అన్వేషించండి

GT Vs SRH: రైజర్స్ జోరుకు బ్రేకులు - ఐదు వికెట్లతో గుజరాత్ విక్టరీ - చివరి బంతి వరకు సాగిన థ్రిల్లర్!

ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఐదు మ్యాచ్‌ల తర్వాత సన్‌రైజర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ చివరి బంతికి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

ఆఖరి ఓవర్ దాకా సాగిన థ్రిల్లర్
196 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (68: 38 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగి ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ (22: 24 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు. మొదటి వికెట్‌కు 69 పరుగులు జోడించిన అనంతరం ఉమ్రాన్ మలిక్ బౌలింగ్‌లో గిల్ అవుటయ్యాడు.

ఈ దశలోనే వృద్ధిమాన్ సాహా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు సరిగ్గా ఆడకపోవడంతో గుజరాత్ 140 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఐదు వికెట్లూ ఉమ్రాన్ మలిక్‌కే దక్కడం విశేషం. చివర్లో రాహుల్ తెవాటియా (40: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), రషీద్ ఖాన్ (31: 11 బంతుల్లో, నాలుగు సిక్సర్లు) చెలరేగడంతో గుజరాత్ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

అదరగొట్టిన అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆశించిన శుభారంభం దొరకలేదు. ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్, ఓపెనర్ కేన్ విలియమ్సన్ (5: 8 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠిని (16: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా గుజరాత్ బౌలర్లు త్వరగా పెవిలియన్‌కు పంపడంతో ఐదు ఓవర్లో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది.

అయితే ఈ దశలో ఓపెనర్ అభిషేక్ శర్మకు (65: 42 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఎయిడెన్ మార్క్రమ్ (56: 40 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) జత కలిశాడు. వీరిద్దరూ వేగంగా ఆడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూశారు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో కొరకరాని కొయ్యగా మారిన రషీద్ ఖాన్‌ను కూడా వీరు వదల్లేదు. రషీద్ ఖాన్ వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 45 పరుగులు పిండుకున్నారు. అభిషేక్ శర్మ కొట్టిన మూడు సిక్సర్లూ రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే వచ్చాయి.

మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 96 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అభిషేక్ శర్మ అవుటయ్యాడు. అప్పటికే తన అర్థ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత ఎయిడెన్ మార్క్రమ్ కూడా వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. నికోలస్ పూరన్ (3: 5 బంతుల్లో), వాషింగ్టన్ సుందర్ (3: 4 బంతుల్లో) ఇద్దరూ విఫలం అయ్యారు.

అయితే చివరి ఓవర్లో మార్కో జాన్సెన్ (8: 5 బంతుల్లో, ఒక సిక్సర్) ఒకటి, శశాంక్ సింగ్ (25: 6 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) మూడు సిక్సర్లు కొట్టారు. దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులకు 195 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్, అభిషేక్ శర్మ ఉన్నంతసేపు స్కోరు 200ను చేరుతుందనిపించినా... తర్వాత వేగం బాగా తగ్గింది. కానీ చివర్లో జాన్సెన్, శశాంక్ దూకుడు కారణంగా భారీ స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీకి మూడు వికెట్లు దక్కాయి. యష్ దయాళ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget