అన్వేషించండి

IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ..

DC vs SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో వరుస విజయాలతో సన్‌రైజర్స్ దూసుకుపోతుండగా, ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఢిల్లీ గెలవక తప్పని మ్యాచ్ ఇది.

DC vs SRH, IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 35 మ్యాచ్  ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ల  మధ్యఈ రోజు  (ఏప్రిల్ 20) న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.  ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది.  వరుసగా అత్యధిక  పరుగులు సాధించి ప్రత్యర్థి జట్లకు ప్రమాదకర హెచ్చరికలను జారీ చేస్తోంది.  టైటిల్‌ గెలవటమే  లక్ష్యంగా  దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ , గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 25 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ సీజన్లో  ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన  ఏడు  మ్యాచ్‌లలో మూడింటిని మాత్రమే గెలుచుకుంది. పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో ఉంది. 

హెడ్-టు-హెడ్ రికార్డ్స్ 

మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్  చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్  , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు   మొత్తం 23 మ్యాచ్‌లు ఆడాయి.  ఈ మ్యాచ్‌లలో, ఢిల్లీ క్యాపిటల్స్  11 గేమ్‌లను గెలుచుకోగా,  12 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఈ రెండు జట్ల   జరిగిన ఐపిఎల్ మ్యాచ్ ఏదీ టైగా ముగియలేదు.

అందులో ముఖ్యంగా ముఖ్యంగా, అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చాలా పేలవమైన రికార్డును కలిగి ఉంది. ఇక్కడ ఈ వేదికపై, ఇండియన్ ప్రీమియర్ లీగ్  చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ని ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్‌లో ఓడించింది.  బలాబలాలు పరంగా ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన స్థితికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలని సన్‌రైజర్స్ అనుకుంటుంది.  

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా మరియు షాయ్ హోప్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, ఉపేంద్ర యాదవ్, ఝటావేద్ సుబ్రమణ్యన్, సన్వీర్ సింగ్, విజయకాంత్ వియాస్కాంత్, ఫజల్హాక్ ఫరూఖీ, మార్కో జాన్సెన్, ఆకాష్ మహరాజ్ సింగ్, మయాంక్ అగర్వాల్.

 

టాప్ హెడ్ లైన్స్

AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget