అన్వేషించండి

Arjun Tendulkar : ముంబైని వీడటంపై అర్జున్ టెండూల్కర్ సంచలన వ్యాఖ్యలు! ఆ కార‌ణంతోనే ల‌క్నోలోకి వెళ్లాన‌ని వెల్ల‌డి

Arjun Tendulkar : ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టీమ్‌లోకి మారిన అర్జున్ టెండూల్కర్, తన కెరీర్ అంచనాలు, ఐపీఎల్ రూల్స్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అర్జున్ టెండూల్కర్ ముంబై నుండి లక్నోకు మారడంపై స్పందించాడు.
  • మ్యాచ్‌లు ఆడాలని ఉంది, కష్టపడి ఆడటమే మన చేతుల్లో ఉంది.
  • ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నిబంధనపై అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
  • లక్నోలో మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం ఉందని అర్జున్ తెలిపాడు.

Arjun Tendulkar : టీమిండియా గ్రేట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సొంతగడ్డ ముంబై ఇండియ‌న్స్ ని వీడి లక్నో సూప‌ర్ జెయింట్స్ తో ఐపీఎల్లో ఆడ‌టంపై స్పందించాడు. అంత‌కుముందు మెగా వేలానికి ముందు ఆల్ రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో అర్జున్ ని ల‌క్నో తీసుకుంది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆయన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) గూటికి చేరాడు. 2021లో ముంబై ఇండియన్స్ (MI) ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ ఆల్ రౌండర్, 2025 వరకు అదే ఫ్రాంచైజీలో కొనసాగాడు. అక్కడ అవకాశాలు తక్కువగా రావడంతో ఈ ఏడాది లక్నో టీమ్ ఆయన్ని సొంతం చేసుకుంది. కొత్త టీమ్ తరపున ఇంకా డెబ్యూ చేయకపోయినప్పటికీ, ముంబై కంటే ఇక్కడ ఎక్కువ మ్యాచులు ఆడే ఛాన్స్ దక్కుతుందని అర్జున్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ముంబై ఇండియన్స్ అనుభవాలు:

రీసెంట్‌గా ఒక‌ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ తన కెరీర్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ముంబై టీమ్‌లో బౌలింగ్ బాగా చేసినా ఎక్కువ అవకాశాలు రాలేదు కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన చాలా మెచ్యూర్డ్‌గా సమాధానం ఇచ్చాడు. "ఎక్కువ మ్యాచులు ఆడాలని ఎవరికి ఉండదు? బెంచ్‌ మీద కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉంటుంది. కానీ కష్టపడి పని చేయడం, అవకాశం వచ్చినప్పుడు పర్ఫార్మ్ చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది" అని అర్జున్ స్పష్టం చేశాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై అభ్యంతరం..

ప్రస్తుతం ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారిన 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్‌పై అర్జున్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గానీ, ఇతర లీగ్స్‌లో గానీ ఇలాంటి రూల్ లేదని ఆయన గుర్తు చేశాడు. "క్రికెట్ అంటే 11 మంది ఆడే ఆట. ఆ 11 మందినే ఎంచుకుని ఆడాలి. వ్యక్తిగతంగా నేను ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు వ్యతిరేకం" అంటూ సీనియర్ ప్లేయర్ల వాయిస్‌ను వినిపించాడు. ఈ రూల్ వల్ల ఆల్ రౌండర్లకు వచ్చే ఇబ్బందులను ఆయన పరోక్షంగా ప్రస్తావించాడు.

లక్నో టీమ్‌లో అర్జున్ పాత్ర..

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉన్నప్పటికీ, మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అర్జున్ టెండూల్కర్‌ను నెంబర్ 6, 7 లేదా 8 స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్‌లో తన సత్తా చాటడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ ఏ పొజిషన్ ఇచ్చినా ఆడేందుకు రెడీ అని అర్జున్ తెలిపాడు. తమ టీమ్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా పవర్‌ఫుల్ అని, టీ20 ఫార్మాట్‌లో ఎవరైనా ఎవరినైనా ఓడించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ టోర్నమెంట్‌లో లక్నోకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు. వారసత్వం ఉన్నప్పటికీ తనకంటూ ఒక సపరేట్ గుర్తింపు కోసం అర్జున్ టెండూల్కర్ పోరాడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్స్, కోచ్‌ల గైడెన్స్‌లో ఆయన ఈ సీజన్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపిస్తే అర్జున్ కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Frequently Asked Questions

అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ ని వీడి లక్నో సూపర్ జెయింట్స్ లోకి ఎందుకు మారాడు?

ముంబై ఇండియన్స్ లో అతనికి తక్కువ అవకాశాలు రావడంతో, లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని ఐపీఎల్ 2026 సీజన్ కోసం సొంతం చేసుకుంది.

బెంచ్ పై కూర్చోవడం గురించి అర్జున్ టెండూల్కర్ ఏమన్నాడు?

ఎక్కువ మ్యాచులు ఆడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే కష్టపడి పనిచేసి అవకాశం వచ్చినప్పుడు రాణించడమే మన చేతుల్లో ఉంటుందని అర్జున్ అన్నాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై అర్జున్ టెండూల్కర్ అభిప్రాయం ఏమిటి?

క్రికెట్ 11 మంది ఆడే ఆట అని, వ్యక్తిగతంగా తాను ఈ రూల్ కి వ్యతిరేకమని అర్జున్ తెలిపాడు.

లక్నో సూపర్ జెయింట్స్ లో అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండవచ్చు?

లక్నో జట్టులో మిడిల్ ఆర్డర్ లో బలహీనత ఉన్నందున, అర్జున్ ను 6, 7, లేదా 8 స్థానాల్లో బ్యాటింగ్ కు పంపే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget