IPL MI Head Coach: ముంబయి ఇండియన్స్ కోచ్‌గా అతడే - ప్రకటించిన ఎంఐ
IPL MI Head Coach: అనుకున్నదే జరిగింది! ముంబయి ఇండియన్స్ కోచ్‌గా మార్క్ బౌచర్‌నే నియమించారు. 2023 సీజన్ నుంచి అతడే జట్టు వ్యూహ బృందాన్ని నడిపించనున్నాడు.
Mark Boucher as MI Head Coach: అనుకున్నదే జరిగింది! ముంబయి ఇండియన్స్ కోచ్‌గా మార్క్ బౌచర్‌నే నియమించారు. 2023 సీజన్ నుంచి అతడే జట్టు వ్యూహ బృందాన్ని నడిపించనున్నాడు. ఈ దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్‌నే కోచ్‌గా ఎంపిక చేస్తారని గురువారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
వికెట్ కీపర్, బ్యాటర్‌గా మార్క్ బౌచర్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. టెస్టు క్రికెట్లో ఎక్కువ మందిని డిస్మసల్ చేసిన రికార్డు అతడికే సొంతం. ఆటగాడిగా వీడ్కోలు పలికిన తర్వాత దక్షిణాఫ్రికా దేశవాళీ జట్టు టైటాన్‌కు కోచ్‌గా పనిచేశాడు. ఐదు టైటిళ్లు అందించాడు. 2019 నుంచి దక్షిణాఫ్రికా ప్రధాన జట్టుకు కోచ్‌గా ఉంటున్నాడు. 11 టెస్టులు, 12 వన్డేలు, 23 టీ20ల్లో విజయాలు అందించాడు. గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వికెట్ కీపింగ్ కోచ్‌గా పనిచేశాడు.
Presenting आपले नवीन Head Coach - 𝐌𝐀𝐑𝐊 𝐁𝐎𝐔𝐂𝐇𝐄𝐑 💙
— Mumbai Indians (@mipaltan) September 16, 2022
Paltan, drop a 🙌 to welcome the 🇿🇦 legend to our #OneFamily 👏#DilKholKe #MumbaiIndians @markb46 @OfficialCSA pic.twitter.com/S6zarGJmNM
ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్‌ను ఎంపిక చేసినందుకు ముంబయి ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. 'ముంబయి ఇండియన్స్‌కు మార్క్ బౌచర్‌ని ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆటగాడిగా మైదానంలో, కోచ్‌గా మైదానం ఆవల అతడెన్నో విజయాలు అందించాడు. ముంబయి ఇండియన్స్ విలువను అతడు మరింత పెంచుతాడు. ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడు' అని పేర్కొన్నారు.
'ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవం. ప్రపంచ క్రీడారంగంలో ఈ ఫ్రాంచైజీకి అనేక విజయాలు ఉన్నాయి. ఘనమైన చరిత్ర, గుర్తింపు ఉన్నాయి. ఈ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. కోరుకునే ఫలితాలు అందిస్తా. జట్టులో బలమైన నాయకత్వం, ఆటగాళ్లు ఉన్నారు' అని బౌచర్ అన్నాడు.
నిజానికి SA20 లీగులో ఎంఐ కేప్‌టౌన్‌కు మార్క్ బౌచర్ కోచ్‌గా ఎంపికవుతాడని భావించారు. చివరి నిమిషాల్లో సైమన్ కటిచ్‌ను తీసుకున్నారు. అతడికి డిప్యూటీగా హసీమ్ ఆమ్లాను ఎంపిక చేశారు. బ్యాటింగ్ కోచ్‌గా తీసుకున్నారు. జేమ్స్ పమ్మెంట్ ఫీల్డింగ్ కోచ్, రాబిన్ పీటర్సన్ జనరల్ మేనేజర్‌గా ఉంటారు.
టీ20 ఫ్రాంచైజీ క్రికెట్లో సైమన్ కటిచ్‌కు విశేష అనుభవం ఉంది. అతడి సేవలకు గిరాకీ బాగానే ఉంది. గతంలో చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆయన పనిచేశాడు. కేకేఆర్‌లో జాక్వెస్ కలిస్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హెడ్‌కోచ్‌గా చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండు నెలలు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఈ మధ్యే హండ్రెడ్ టోర్నీలో మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు హెడ్‌కోచ్‌గా అద్భుతాలు చేశాడు. జట్టును రన్నరప్‌గా నిలిపాడు.
"He's an exciting coach & thinks differently." 🧠
— Mumbai Indians (@mipaltan) September 16, 2022
Mahela shares his views on the appointment of Mark Boucher 🤝#OneFamily #DilKholKe #MumbaiIndians @MahelaJay @markb46 MI TV pic.twitter.com/N6V848Ycmp
ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు క్రేజ్ పెరిగింది. దాదాపుగా అన్ని క్రికెటింగ్ దేశాల్లో టీ20 లీగులు పెడుతున్నారు. దాంతో ఇతర లీగుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జట్లను సొంతం చేసుకుంటోంది. దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్, యూఏఈ ఐఎల్‌టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జట్లకు కలిపి కోచింగ్ విషయాల్లో మార్పులు చేసింది. 2017 నుంచి ముంబయి ఇండియన్స్‌కు కోచ్‌గా ఉన్న మహేలా జయవర్దనెను గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫామెన్స్, జహీర్ ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా నియమించింది. వీరిద్దరూ ఇకపై మూడు జట్ల కార్యకలాపాల్లో కీలకంగా ఉంటారు. దాంతో ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచ్‌ను ఎంపిక చేశారు.
Mark Boucher joins the #OneFamily as #MumbaiIndians’ Head Coach 💙
— Mumbai Indians (@mipaltan) September 16, 2022
Welcome onboard, Mark 🙌
Read more 👇https://t.co/vR6TV7QvTN#DilKholKe @markb46