By: ABP Desam | Updated at : 26 Feb 2023 11:36 PM (IST)
ఐపీఎల్ 2023లో కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగే జట్లు
IPL 2023, New Captains of Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ గురించి ఇప్పటికే ప్రజల్లో ఆసక్తి పెరగడం మొదలైంది. అలాగే జట్లు కూడా విభిన్న వ్యూహాలతో సన్నద్ధం అవుతున్నాయి. ఐపీఎల్ కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ గ్రాండ్ లీగ్ క్రికెట్ కోసం అన్ని జట్లు ఇప్పటికే వ్యూహాలు రచించడం ప్రారంభించాయి. ఈసారి కొత్త కెప్టెన్‌తో కొన్ని జట్లు ఐపీఎల్‌లోకి అడుగు పెట్టనున్నాయి. అటువంటి పరిస్థితిలో కొత్త కెప్టెన్లతో ఐపీఎల్ 2023లో ఏ జట్టు బరిలోకి దిగనున్నాయో చూద్దాం.
1. సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఎయిడెన్ మార్క్రమ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఒకప్పటి ఐపీఎల్ ఛాంపియన్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌తో రంగంలోకి దిగనుంది. ఐపీఎల్ తదుపరి సీజన్‌కు ఎయిడెన్ మార్క్రమ్ రూపంలో కొత్త కెప్టెన్‌ను హైదరాబాద్ జట్టు ప్రకటించింది.
ఇటీవలే దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్ టైటిల్‌ను ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ లోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ జట్టు గెలుచుకుంది. అటువంటి పరిస్థితిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ రెండో టైటిల్‌ను అందిస్తుందని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తుంది.
2. ఢిల్లీ క్యాపిటల్స్ - డేవిడ్ వార్నర్
సాధారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కానీ తనకి యాక్సిడెంట్ అవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని వార్తలు వస్తున్నాయి.
డేవిడ్ వార్నర్ చాలా కాలం పాటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలోనే హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. అటువంటి పరిస్థితిలో డేవిడ్ వార్నర్ ఈ ఫ్రాంచైజీకి మొదటి టైటిల్ అందిస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ భావించి తనకు కెప్టెన్సీ బాధ్యతలు అందించే అవకాశం ఉంది.
3. పంజాబ్ కింగ్స్ - శిఖర్ ధావన్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌తో IPL 2023లో అడుగుపెట్టనుంది. టీమిండియా లెజెండరీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ని కెప్టెన్‌గా చేసింది. మయాంక్ అగర్వాల్‌ను టీమ్ నుంచి రిలీవ్ చేసిన తర్వాత శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ అందించారు. శిఖర్ ధావన్ అనేక సందర్భాల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించి జట్టుకు విజయాలు అందించాడు. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్ జట్టును శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో చాంపియన్‌గా నిలుపుతాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశించే అవకాశం ఉంది.
IPL 2023 షెడ్యూల్ గురించి చెప్పాలంటే ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. వీటి మధ్య మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. వాటిలో 70 మ్యాచ్‌లు లీగ్ దశలో, నాలుగు మ్యాచ్‌లు ప్లేఆఫ్‌లో జరగనున్నాయి. లీగ్ దశలో అన్ని జట్లు తలో 14 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ 2023 మే 21వ తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌ను మే 28వ తేదీన నిర్ణయించారు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్రతి శని, ఆదివారాల్లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా ఆడనున్నారు. ఈ విధంగా ఈ సీజన్‌లో మొత్తం 18 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ఈసారి సఫారీ సవారి సాగలేదు- కరేబియన్ కుర్రాళ్లదే టీ20 సిరీస్
Pragyan Ojha on Rohit Sharma: కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ! అడిగితే ఎమోషనల్!
Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్