IPL 2021, SRH vs KKR: 'నిద్ర మాత్రల్లా' పనిచేస్తున్న సన్‌రైజర్స్ బ్యాటర్లు.. వీరూ విసుర్లు!
హైదరాబాద్ బ్యాటింగ్‌పై సెహ్వాగ్ సున్నితంగా విమర్శలు చేశాడు. ఆ జట్టు బ్యాటర్లు నిద్రమాత్రల్లా పనిచేస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే కోల్‌కతా మ్యాచులో ఆఖరి నాలుగు ఓవర్లు నిద్రపోయా అన్నాడు.
టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన హాస్య చతురతను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌పై సున్నితంగా విమర్శలు చేశాడు. ఆ జట్టు బ్యాటర్లు నిద్రమాత్రల్లా పనిచేస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే కోల్‌కతా మ్యాచులో ఆఖరి నాలుగు ఓవర్లు నిద్రపోయానని వెల్లడించాడు.
Also Read: 'దారి తప్పిన పరుగుల వరద' : ఓడిన మ్యాచుల్లో టాప్ స్కోరర్లు వీరే!
కోల్‌కతాతో ఆదివారం జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 115 పరుగులు చేసింది. పిచ్ కఠినంగా ఉండటంతో కోల్‌కతా సైతం ఆఖరి ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తానికి సన్‌రైజర్స్ బ్యాటింగ్ మాత్రం మొదట్నుంచీ నిరాశపరుస్తూనే ఉంది.
Also Read: చితక బాదుడు 'సీక్రెట్' చెప్పిన మాక్సీ! బెంగళూరు అలా చెప్పడం వల్లే!
'హైదరాబాద్ రాయ్, సాహాతో ఇన్నింగ్స్ ఆరంభించింది. వారిద్దరూ వెంటవెంటనే డగౌట్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత విలియమ్సన్, ప్రియమ్ గార్గ్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. వికెట్ నెమ్మదిగా ఉండటంతో పరుగులేం రాలేదు. ఆట సైతం నత్తనడకన సాగింది. టీవీ తెరపైనా అంతరాయానికి చింతిస్తున్నాం అని సందేశం వచ్చింది' అని వీరూ అన్నాడు.
Also Read: ఢిల్లీతో చెన్నై ఢీ.. గెలిచినవాళ్లకే టాపర్లయ్యే అవకాశం!
'ఆ తర్వాత అబ్దుల్ సమద్ వచ్చి మూడు సిక్సర్లు కొట్టాడు. కానీ 25 పరుగులు చేయగానే ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు నిద్ర మాత్రల్లా పనిచేశారు. నేనైతే ఆఖరి నాలుగు ఓవర్లు నిద్రపోయాను. లేచి చూస్తే హైదారబాద్ 20 ఓవర్లకు 115/8 పరుగులు చేసినట్టు తెలిసింది' అని సెహ్వాగ్ తెలిపాడు.
Also Read: పంజాబ్ పాత కథే! విజయానికి చేరువై బోల్తా! ప్లేఆఫ్స్ చేరిన కోహ్లీసేన
ఇక సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆ జట్టు తరఫున వంద మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడు ఎనిమిది సీజన్లలో 117 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
An @IPL title, two purple caps
— SunRisers Hyderabad (@SunRisers) October 4, 2021
and tireless bowling performances.
Well done @BhuviOfficial on completing a memorable century as a #Riser.#OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/PooFEsKcrv