News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IPL 2021, DC vs CSK: ఢిల్లీతో చెన్నై ఢీ.. గెలిచినవాళ్లకే టాపర్లయ్యే అవకాశం!

IPL 2021, Delhi Capitals Vs Chennai Super Kings: ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

FOLLOW US: 
Share:

ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఇది 50వ మ్యాచ్. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లూ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం టాప్-2లో ఈ రెండు జట్లే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ సీజన్‌లో నంబర్ వన్ జట్టు అయ్యే చాన్స్ ఉంది.

రాజస్తాన్‌తో మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు ఘోరంగా విఫలం అయ్యారు. దీపక్ చాహర్, డ్వేన్ బ్రేవో లేని లోటు అత్యంత స్పష్టంగా కనిపించింది. కాబట్టి నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక చెన్నై బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. రుతురాజ్ ఆరెంజ్ క్యాప్‌ను సాధించగా, డుఫ్లెసిస్ కూడా అవసరమైన పరుగులు చేస్తున్నారు. ప్రారంభ ఓవర్లలో వీరు చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తున్నారు. మిడిలార్డర్‌లో మొయిన్ అలీ, రాయుడు, జడేజాలు కూడా బాగా ఆడుతున్నారు.

Also Read: కోల్‌కతా మ్యాచుకు ముందు పంజాబ్‌కు షాక్‌! బుడగ వీడిన క్రిస్‌గేల్‌.. ఎందుకంటే?

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్టీవ్ స్మిత్‌కు తుదిజట్టులో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తుంది. షా, ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అందరూ ఫాంలో ఉన్నారు. బౌలింగ్‌లో అవేష్ ఖాన్, నోర్జే, రబడ, అక్షర్ పటేల్, అశ్విన్ తమ బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నారు.

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరగ్గా.. 15 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అలవోకగా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి టాప్ ప్లేస్‌ను అందుకుంటుందా.. చెన్నై గెలిచి లెక్క సరిచేస్తుందా తెలియాలంటే.. సాయంత్రం దాకా ఆగాల్సిందే!

ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు (అంచనా)
పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రన్ హెట్‌మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, అవేష్ ఖాన్, ఆన్రిచ్ నోర్జే

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, డుఫ్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, బ్రేవో/కరన్, దీపక్ చాహర్/ఆసిఫ్, శార్దూల్ ఠాకూర్, జోష్ హజిల్ వుడ్

Also Read: యాష్‌ తప్పేం చేయలేదు! సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్‌!

Also Read: విరాట్‌ సరసన స్మృతి మంధాన.. పింక్‌ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్‌ వెళ్లిన పూనమ్‌!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Oct 2021 12:13 PM (IST) Tags: CSK MS Dhoni IPL 2021 Delhi Capitals DC Chennai super kings Rishabh Pant Dubai International Cricket Stadium DC vs CSK IPL 2021 Match 50

ఇవి కూడా చూడండి

IND Vs AUS, Innings Highlights:శతకంతో  రుతురాజ్ ఊచకోత , ఆసీస్ పై మరోసారి భారీ స్కోర్

IND Vs AUS, Innings Highlights:శతకంతో రుతురాజ్ ఊచకోత , ఆసీస్ పై మరోసారి భారీ స్కోర్

India vs Australia 3rd T20: ఆరుగురు ఆసిస్‌ ఆటగాళ్లు స్వదేశానికి , మిగిలిన రెండు టీ 20లకు కొత్త జట్టే

India vs Australia 3rd T20: ఆరుగురు ఆసిస్‌ ఆటగాళ్లు స్వదేశానికి , మిగిలిన రెండు టీ 20లకు కొత్త జట్టే

Jasprit Bumrah: హార్దిక్‌ పాండ్యా రాకతో బుమ్రా అసహనం! ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోంది?

Jasprit Bumrah: హార్దిక్‌ పాండ్యా రాకతో బుమ్రా అసహనం! ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోంది?

Pat Cummins: మరవను, మర్చిపోలేను- విరాట్‌ వికెట్టే బౌలర్ కెరీర్ లో అద్భుత క్షణం

Pat Cummins: మరవను, మర్చిపోలేను- విరాట్‌ వికెట్టే బౌలర్ కెరీర్ లో అద్భుత క్షణం

IPL 2024: నాకూ ఐపీఎల్‌ ఆడాలని ఉంది, పాక్‌ క్రికెటర్‌ మనసులో మాట

IPL 2024: నాకూ ఐపీఎల్‌ ఆడాలని ఉంది, పాక్‌ క్రికెటర్‌ మనసులో మాట

టాప్ స్టోరీస్

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?