X
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 14 - 23 Oct 2021, Sat up next
ENG
vs
WI
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

IPL 2021 Eliminator, RCB Vs KKR: ఆర్సీబీతో కోల్‌కతా ఢీ.. ఓడిన జట్టు ఇంటికే!

కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి బాట పట్టడమే.

FOLLOW US: 

ఐపీఎల్‌లో నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు క్వాలిఫయర్ 2 ఆడే అవకాశం ఉంటుంది. లీగ్ లీడర్ ఢిల్లీపై చివరి బంతికి విజయం సాధించి.. రాయల్ చాలెంజర్స్ ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

ఇక కోల్‌కతా కూడా తన చివరి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఏకంగా 86 పరుగులతో విజయం సాధించింది. ఈ రెండు జట్లూ విజయాలతో ఉండటంతో ఈ మ్యాచ్ కూడా థ్రిల్లింగ్‌గా సాగే అవకాశం ఉంది. డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ కచ్చితంగా తమ బెస్ట్ ఇస్తాయి.

ఆర్‌సీబీ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అయితే గత కొన్ని మ్యాచ్‌లుగా కోహ్లీ, పడిక్కల్ విఫలం అవుతున్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఫాం జట్టుకు పెద్ద ప్లస్. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మ్యాక్స్‌వెల్ 498 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో హర్షల్ పటేల్, చాహల్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. బ్యాట్‌తో మెరుస్తున్న మ్యాక్స్‌వెల్ అప్పుడప్పుడు బంతితో కూడా వికెట్లు తీస్తూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ యూఏఈలో సూపర్ ఫాంలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు విజయాలు సాధించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి బీభత్సమైన ఫాంలో ఉన్నారు. నితీష్ రాణా కూడా అడపాదడపా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్‌ల ఫాం జట్టును ఇబ్బంది పెడుతుంది. బౌలర్లలో శివం మావి, లోకి ఫెర్గూసర్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వికెట్లు తీస్తూ అదరగొడుతున్నారు.

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. 15 మ్యాచ్‌ల్లో బెంగళూరు, 13 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలిచాయి. మరి ఈ మ్యాచ్‌లో గెలిచి ఎవరు ఎవర్ని ఇంటికి పంపిస్తారో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే!

Also Read: డేవిడ్‌ వార్నర్‌ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అనుమానం!

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్, శివం మావి, వరుణ్ చక్రవర్తి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), డాన్ క్రిస్టియన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్

Also Read: ఆఖరి బంతికి సిక్స్‌..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి

Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: RCB Virat Kohli IPL 2021 KKR royal challengers bangalore Kolkata Knight Riders Venkatesh IYER KKR Vs RCB Preview IPL 2021 Eliminator

సంబంధిత కథనాలు

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

T20 Worldcup 2021: మొదటి సారి సూపర్ 12కు క్వాలిఫై అయిన జట్టు ఇదే.. ఇక నుంచి అసలు సమరం!

T20 Worldcup 2021: మొదటి సారి సూపర్ 12కు క్వాలిఫై అయిన జట్టు ఇదే.. ఇక నుంచి అసలు సమరం!

ICC World Cup 2022: అప్పుడే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు.. ఎక్కడ జరుగుతున్నాయంటే?

ICC World Cup 2022: అప్పుడే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు.. ఎక్కడ జరుగుతున్నాయంటే?

IPL 2022: సీఎస్‌కే, డీసీ, ఎంఐ, ఆర్‌సీబీ హ్యాపీ.. హ్యాపీ! బీసీసీఐ గుడ్‌ న్యూస్‌!

IPL 2022: సీఎస్‌కే, డీసీ, ఎంఐ, ఆర్‌సీబీ హ్యాపీ.. హ్యాపీ! బీసీసీఐ గుడ్‌ న్యూస్‌!

T20 World Cup 2021: ఆ జట్లే ఫేవరెట్‌.. ఫామ్‌లో లేని ఆ ఇద్దరు ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీ అవుతారట: వార్న్‌ జోస్యం

T20 World Cup 2021: ఆ జట్లే ఫేవరెట్‌.. ఫామ్‌లో లేని ఆ ఇద్దరు ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీ అవుతారట: వార్న్‌ జోస్యం
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

WhatsApp: వాట్సాప్ విదేశి సంస్థ.. భారత చట్టాలను సవాలు చేయలేదు.. అడిగితే సమాచారం ఇవ్వాల్సిందే.. కేంద్రం

WhatsApp: వాట్సాప్ విదేశి సంస్థ.. భారత చట్టాలను సవాలు చేయలేదు.. అడిగితే సమాచారం ఇవ్వాల్సిందే.. కేంద్రం