By: ABP Desam | Updated at : 21 Jul 2022 12:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
టీమ్‌ఇండియా ( Image Source : Getty )
India tour of West Indies: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. మ్యాచుకు ముందు ట్రినిడాడ్‌లో సాధన చేసింది. దీనికి వరుణుడు అడ్డుపడ్డాడు. హఠాత్తుగా వర్షం రావడంతో ఆటగాళ్లంతా ఇండోర్ ఫెసిలిటీలో ప్రాక్టీస్ చేశారు. కుర్రాళ్లంతా ఉత్సాహంగా కనిపించారు.
టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలో ఆటగాళ్లు సాధన చేశారు. శుభ్‌మన్ గిల్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ హుషారుగా కనిపించారు. వర్షం అడ్డంకిగా మారినా అందరం కలిసి ఇండోర్‌లో సాధన చేశామని శుభ్‌మన్ గిల్ చెప్పాడు.
భారత్ సాధన చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసింది. కాగా వెస్టిండీస్, భారత్ తొలి వన్డే శుక్రవారం జరగనుంది. అక్కడ ఉదయమే మొదలవుతున్నా భారత కాలమానాం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఉంటుంది.
Gearing up for ODI No.1 against the West Indies 💪
Here's @ShubmanGill giving a lowdown on #TeamIndia's 🇮🇳 first net session in Trinidad 🇹🇹#WIvIND pic.twitter.com/oxF0dHJfOI — BCCI (@BCCI) July 21, 2022
రోహిత్, కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో వన్డే సిరీసుకు గబ్బరే కెప్టెన్సీ చేస్తున్నాడు. గయానాలో అడుగుపెట్టిన వెంటనే కుర్రాళ్లంతా కలిసి ఓ వీడియో చేశారు. 'హే ట్రెండ్'తో సందడి చేశారు. ఈ వీడియోను శిఖర్ ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ జులై 22న 27న ముగుస్తుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోనే మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత జులై 29 నుంచి ఐదు టీ20ల సిరీసు మొదలవుతుంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్ కీట్స్‌లోని వార్నర్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.
విండీస్‌తో టీ20 సిరీసుకు టీమ్‌ఇండియా అంచనా జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్
Trinidad - WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022
Ross Taylor Slapgate: షాకింగ్ రిపోర్ట్స్! రాస్ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?
BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?
CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్! గమ్చా అలంకరించిన హిమ దాస్!
Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం