DRS controversy: మైదానంలో జరిగింది బయటి జనాలకు తెలుసా? డీఆర్‌ఎస్ వివాదంపై కోహ్లీ స్పందన
డీఆర్‌ఎస్ వివాదంపై టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. మైదానంలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలియదని పేర్కొన్నాడు. అలాంటప్పుడు తనను తాను సమర్థించుకోవడంలో అర్థం లేదని అంటున్నాడు.
DRS controversy in Cape Town Test: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులో డీఆర్‌ఎస్ వివాదంపై టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. మైదానంలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలియదని పేర్కొన్నాడు. అలాంటప్పుడు తనను తాను సమర్థించుకోవడంలో అర్థం లేదని అంటున్నాడు. నాలుగో రోజు ఉదయం వెంటవెంటనే మూడు వికెట్లు తీసుకుంటే ఫలితం మరోలా ఉండేదని వెల్లడించాడు. టెస్టు సిరీసు ఓటమి తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మూడో టెస్టులో తలపడుతున్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఛేదనలో సఫారీ జట్టు 60/1తో ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ ఓ ఫ్లయిటెడ్ డెలివరీ వేశాడు. ఆ బంతి డీన్ ఎల్గర్ ప్యాడ్లకు తగలడంతో అంపైర్ మారియస్ ఎరాస్మస్ ఎల్బీ ఇచ్చాడు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ సమీక్ష కోరాడు. అయితే ట్రాజెక్టరీ చూసినప్పుడు బంతి ఇన్‌లైన్‌లోనే పిచ్ అయినట్టు కనిపించింది. అయితే వికెట్లకు తగలకుండా పోతున్నట్టు చూపించింది.
South Africa win the final Test by 7 wickets and clinch the series 2-1.#SAvIND pic.twitter.com/r3pGCbbaTx
— BCCI (@BCCI) January 14, 2022
నిర్ణయం భిన్నంగా రావడంతో అంపైర్ మరియస్ 'ఇది అసాధ్యం' అన్నాడు. ఇదే సమయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా చిరాకుకు గురయ్యారు. చూస్తుంటే మొత్తం దేశం కేవలం 11 మందికి వ్యతిరేకంగా ఆడుతున్నట్టు కనిపిస్తోందని కేఎల్ రాహుల్ అన్నాడు. రానురాను ఆట చెడ్డగా మారుతోందని మయాంక్ అగర్వాల్ అన్నాడు. ఇదే సమయంలో స్టంప్ మైక్ వద్దకు వచ్చిన కోహ్లీ 'కేవలం ప్రత్యర్థిపైనే కాకుండా వాళ్లు బంతిని నునుపు చేస్తున్నప్పుడు నీ జట్టుపైనా దృష్టి పెట్టు. ప్రతిసారీ జనాల గురించే ప్రయత్నిస్తావు' అని అన్నాడు. కోహ్లీ మాట్లాడిన విధానాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. దీనిపై విరాట్ స్పందించాడు.
'మాట్లాడేందుకు ఏమీ లేదు. మైదానంలో జరిగింది నాకర్థమైంది. కానీ బయట జనాలకు అక్కడేం జరిగిందో అస్సలు తెలియదు కదా. అలాంటప్పుడు నన్ను నేను సమర్థించుకొనేందుకు ప్రయత్నించడం వృథా. సందర్భాన్ని బట్టి సాగాలంతే. ఏదేమైనా నాలుగో రోజు ఉదయం మేం మూడు వికెట్లు త్వరగా పడగొట్టి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. బహుశా మ్యాచ్ మలుపు తిరిగేది' అని కోహ్లీ అన్నాడు.
Also Read: IND vs SA, 3rd Test: కోహ్లీ.. స్టంప్‌మైక్ వద్ద ఆ మాటలేంటి? ఇంకేం ఆదర్శంగా ఉంటాడని గౌతీ విమర్శ
Also Read: IND vs SA: 1 గెలిచి 2 ఓడటం: మనకిదేం కొత్త కాదు బాబూ.. ఓసారి వెనక్కి వెళ్లండి!!
Also Read: IND vs SA ODI Series Schedule: టెస్టు సిరీసు పోయింది! ఇక వన్డేల్లోనైనా గెలుస్తారా? షెడ్యూలు ఇదే