Ind vs SA, Highlights: మళ్లీ కోహ్లీపైనే భారం.. రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైన ఓపెనర్లు!
IND vs SA, 3rd Test, Newlands Cricket Ground: కేప్ టౌన్‌లో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 57-2 స్కోరును సాధించింది.
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (14 బ్యాటింగ్: 39 బంతుల్లో, రెండు ఫోర్లు), చతేశ్వర్ పుజారా (9 బ్యాటింగ్: 31 బంతుల్లో, రెండు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత్ మొత్తంగా 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ, జాన్సెన్‌లకు చెరో వికెట్ పోతుంది.
రెండో రోజు చివరి సెషన్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఆరు ఓవర్లలోనే కీలకమైన ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10: 22 బంతుల్లో, రెండు ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (7: 15 బంతుల్లో, ఒక ఫోర్) ఇద్దరూ అవుటయ్యారు. అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ, పుజారా మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
అంతకుముందు దక్షిణాఫ్రికా 210 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో కీగన్ పీటర్సన్ (70) ఒక్కడే పోరాడాడు. భారత బౌలర్లలో బుమ్రాకు ఐదు వికెట్లు దక్కాయి.
STUMPS on Day 2 of the 3rd Test.#TeamIndia 223 & 57/2, lead South Africa (210) by 70 runs.
— BCCI (@BCCI) January 12, 2022
Scorecard - https://t.co/yUd0D0Z6qF #SAvIND pic.twitter.com/WX4MlYHoU9
Stumps on Day 2!
— ICC (@ICC) January 12, 2022
An enthralling day of Test cricket ends with India going in at 57/2, a lead of 70.
Watch #SAvIND live on https://t.co/CPDKNxpgZ3 (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE2mW1 pic.twitter.com/w3qrs6YkLZ
A 5-ne day! ✨ Wishing for a Bhogi Blockbuster tomorrow! 💪#SAvIND #WhistlePodu 🦁💛 pic.twitter.com/awEaTKEuP6
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) January 12, 2022
𝘾𝙖𝙥𝙚 𝙏𝙤𝙬𝙣, from where it all started. 🔥
— Mumbai Indians (@mipaltan) January 12, 2022
2️⃣0⃣1⃣8⃣ 👉 2️⃣0⃣2️⃣2️⃣
A 𝘀𝗽𝗲𝗰𝗶𝗮𝗹 bowler then, a 𝘀𝗽𝗲𝗰𝗶𝗮𝗹 bowler now! 💙#OneFamily #SAvIND @Jaspritbumrah93 @BCCI pic.twitter.com/Qrr1iLQEGz
Also Read: IPL New Sponsor: వివో ఔట్! ఇకపై 'టాటా ఐపీఎల్'! చైనా కంపెనీకి గుడ్‌బై!!
Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్ మెగా వేలం