By: ABP Desam | Updated at : 12 Jan 2023 08:14 PM (IST)
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
2022లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా, ఆస్ట్రేలియా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ టికెట్ల వ్యవహారం ఎంత రసాభాసగా మారిందో అందరికీ తెలిసిందే. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) రాబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ కోసం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు విక్రయించాలని నిర్ణయించింది.
జనవరి 18వ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఆర్‌జీఐసీఎస్)లో జరగనున్న వన్డే టిక్కెట్లను శుక్రవారం నుంచి పేటీఎం యాప్, వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ విలేకరులకు తెలిపారు. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం అస్సలు ఉండదు.
నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ నగరంలో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన అజహర్ జనవరి 15వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎల్‌బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంల్లో తప్పనిసరిగా ఫిజికల్ కాపీలను కూడా తీసుకోవాలని తెలిపారు.
వినియోగదారులు ఫిజికల్ టిక్కెట్‌లను రీడీమ్ చేయడానికి కౌంటర్‌ల వద్ద ధృవీకరణ కోసం వారి ఫోటో ఐడీతో పాటు పేటీయం నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్‌ను చూపించాల్సి ఉంటుంది. టిక్కెట్లు జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య Paytm లో అందుబాటులో ఉంటాయి.
మొదటి రోజు 6,000 టిక్కెట్లు, మరుసటి రోజు నుంచి 7,000 టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. స్టేడియంలో 39,112 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. 9,695 టిక్కెట్లను కాంప్లిమెంటరీ టిక్కెట్‌లుగా కేటాయించిన తర్వాత, 29,417 టిక్కెట్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి.
రూ.850, రూ.1,000, రూ.1,250, రూ.1,500, రూ.2,500, రూ.5,000, రూ.9,000, రూ.17,700, రూ.20,650 రేంజ్‌లో టిక్కెట్‌లు ఉండనున్నాయి. ఒక వ్యక్తి కేవలం నాలుగు టిక్కెట్ల వరకు మాత్రమే కొనుగోలు చేయగలడు.
#indvsnz Online tickets will be releasing from Jan 13th ..
— Siva Sankar naidu pathipati (@sankar_sinny18) January 11, 2023
> tickets will be sold phase wise -
13th Jan - 5 PM - 6000 Tickets
14th Jan - 5 PM - 7000 Tickets
15th JAN - 5 PM - 7000 Tickets
16th Jan - 5 PM - Anything remaining
Only on Paytm Insider.. tickets rates are below pic.twitter.com/IGvTCqooN3
IND vs NZ: ఆ నలుగురి సరసన శుభ్‌మన్ గిల్ - అరుదైన రికార్డు!
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
IND vs NZ: కెరీర్ బెస్ట్ ఫాంలో శుభ్‌మన్ గిల్ - విరాట్ కోహ్లీ వారసుడు అనుకోవచ్చా?
IND vs NZ: ఇషాన్ కిషన్‌కు శాపంగా మారిన డబుల్ సెంచరీ - గణాంకాలు ఏం చెప్తున్నాయి?
Indian Players: ఈ ఐదుగురు స్టార్ క్రికెటర్లు రిటైర్ అయ్యే అవకాశం - వేగంగా మారుతున్న భారత జట్టు ఈక్వేషన్స్
YSRCP News: ఆ ఎమ్మెల్యే ఏడో తరగతి తప్పినోడు, ఎప్పుడూ సినిమాలంటాడు - వైసీపీ లీడర్ల మధ్య ముసలం
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?