News
News
X

Ind vs NZ, 1st Test Match Highlights: అయ్యర్‌ శతక భేరి..! ఇండియా 345కి ఆలౌట్‌.. ఆకట్టుకున్న యాష్‌!

టీమ్‌ఇండియా ఫర్వాలేదనిపించింది. న్యూజిలాండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 345కి ఆలౌటైంది. అయ్యర్ శతకం చేయగా అశ్విన్‌ పోరాటం ఆకట్టుకుంది.

FOLLOW US: 
 
కాన్పూర్‌ టెస్టులో టీమ్‌ఇండియా ఫర్వాలేదనిపించింది! న్యూజిలాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసింది. 111.1 ఓవర్లకు ఆలౌటైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13x4, 2x6) అరంగేట్రంలోనే శతకంతో అదరగొట్టాడు. ఈ ఘనత అందుకున్న 16వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శుభ్‌మన్‌ గిల్‌ (52), రవీంద్ర జడేజా (50) అర్ధశతకాలతో రాణించారు.

ఓవర్‌నైట్‌ స్కోరు 258/4తో రెండోరోజు, శుక్రవారం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. నైట్‌ వాచ్‌మన్‌ రవీంద్ర జడేజా (50; 112 బంతుల్లో 6x4) మరో 12 బంతులకే ఔటై నిరాశపరిచాడు. అరంగేట్రం వీరుడు శ్రేయస్‌ అయ్యర్‌ (75 ఓవర్‌నైట్‌ స్కోరు) మాత్రం అద్భుతంగా ఆడాడు. తన దేశవాళీ క్రికెట్‌ అనుభవాన్ని ప్రదర్శించాడు. చూడచక్కని బౌండరీలు బాదేస్తూ 157 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. దాంతో భారత్‌ 94.5 ఓవర్ల వద్ద  300 పరుగుల మైలురాయి అందుకుంది. మరో 5 పరుగులకే అయ్యర్‌ను సౌథీ పెవిలియన్‌ చేర్చడంతో జట్టు కష్టాల్లో పడింది.

ఆఖర్లో స్కోరు పెంచేందుకు అశ్విన్‌ (38; 56 బంతుల్లో 5x4) చేసిన పోరాటం ఆకట్టుకుంది. సమయోచితంగా ఆడుతూ ఐదు బౌండరీలు బాదేశాడు. అతడికి ఉమేశ్‌ యాదవ్‌ (10*; 34 బంతుల్లో) అండగా నిలిచాడు. వీరిద్దరూ 26 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే జట్టు స్కోరు 339 వద్ద యాష్‌ను అజాజ్‌ పటేల్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మరికాసేపటికే ఇషాంత్‌ (0)నూ పటేలే ఔట్‌ చేయడంతో భారత్‌ ఆలౌటైంది. అక్షర్‌ పటేల్‌ (3), వృద్ధిమాన్‌ సాహా (1) విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 5, జేమీసన్‌ 3, అజాజ్‌ పటేల్‌ 2 వికెట్లు తీశారు.

Also Read: Test Match Records: 23 ఏళ్లకే శుభ్‌మన్‌ అరుదైన రికార్డు.. సన్నీకి చేరువ అవుతాడా?

Also Read: IPL 2022 Auction: పంజాబ్‌కు రాహుల్‌ షాక్‌..! మోర్గాన్‌, డీకేను వదిలేస్తున్న కోల్‌కతా!

Also Read: Shreyas Iyer Test Debut: వాహ్.. అరంగేట్రంలోనే అదరగొట్టావుగా.. శ్రేయస్‌పై సోషల్‌మీడియా ప్రశంసలు!

Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!

Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?

Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 26 Nov 2021 12:41 PM (IST) Tags: India New Zealand Shreyas Iyer Ravichandran Ashwin Ind Vs NZ 1st Test

సంబంధిత కథనాలు

IND vs BAN: కొత్త సిరీస్, కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం - భారత్, బంగ్లాదేశ్‌ల మొదటి మ్యాచ్ వివరాలు ఇవే!

IND vs BAN: కొత్త సిరీస్, కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం - భారత్, బంగ్లాదేశ్‌ల మొదటి మ్యాచ్ వివరాలు ఇవే!

Deepak Chahar: భోజనం పెట్టలేదు, లగేజ్ ఇవ్వలేదు- మేం ఎలా ఆడాలి: దీపక్ చాహర్

Deepak Chahar: భోజనం పెట్టలేదు, లగేజ్ ఇవ్వలేదు-  మేం ఎలా ఆడాలి:  దీపక్ చాహర్

సస్పెన్షన్ ప్రమాదంలో పడబోతున్న పీసీబీ - అలా చేస్తే గడ్డుకాలమే!

సస్పెన్షన్ ప్రమాదంలో పడబోతున్న పీసీబీ - అలా చేస్తే గడ్డుకాలమే!

Rohit Sharma: బంగ్లా టైగర్స్‌పై గెలుపు సులువేం కాదు - ఆఖరి వరకు భయపెడతారన్న రోహిత్‌

Rohit Sharma: బంగ్లా టైగర్స్‌పై గెలుపు సులువేం కాదు - ఆఖరి వరకు భయపెడతారన్న రోహిత్‌

Virender Sehwag: టీ20లు మాత్రమే కాదు- వన్డేలు, టెస్టులు కూడా ఆ పని చేయగలవు: సెహ్వాగ్

Virender Sehwag: టీ20లు మాత్రమే కాదు- వన్డేలు, టెస్టులు కూడా ఆ పని చేయగలవు: సెహ్వాగ్

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు