By: ABP Desam | Updated at : 06 Feb 2023 10:33 PM (IST)
రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ల్లో ఎవరి రికార్డు మెరుగ్గా ఉంది?
Rohit Sharma vs Pat Cummins as Test Captains: ఈసారి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో, రెండు జట్లకు కొత్త కెప్టెన్లు ఉండనున్నారు. భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా, ఆస్ట్రేలియాకు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇద్దరు ఆటగాళ్లు కెప్టెన్లుగా టెస్టుల్లో ఒకరిపై ఒకరు ఆడలేదు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలిసారి ఆస్ట్రేలియాపై మైదానంలోకి దిగనున్నాడు. అదే సమయంలో పాట్ కమిన్స్ కూడా భారత్‌పై తొలిసారి ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా ఇద్దరి గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఎవరిది పైచేయి అవుతుంది?
టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆస్ట్రేలియాతో కెప్టెన్‌గా మూడో టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. మరోవైపు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా తరఫున మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అటువంటి పరిస్థితిలో పాట్ కమిన్స్ ముందు రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ అనుభవం చాలా తక్కువగా ఉంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఎలా కనిపిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
టెస్టు కెప్టెన్లుగా రోహిత్ శర్మ, పాట్ కమిన్స్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?
రోహిత్ శర్మ
భారత టెస్టు కెప్టెన్‌గా, రోహిత్ శర్మ ఇప్పటివరకు కేవలం రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మ విజయం సాధించాడు. టెస్టు కెప్టెన్‌గా అతని గెలుపు శాతం 100 శాతంగా ఉంది.
2022లో శ్రీలంకతో ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించాడు. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలిచింది. అదే సమయంలో రెండో మ్యాచ్‌లో టీమిండియా 238 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ రెండు టెస్టుల్లో 30 సగటుతో 90 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 46 పరుగులుగా ఉంది.
పాట్ కమిన్స్
ప్యాట్ కమిన్స్ ఇప్పటి వరకు టెస్టు కెప్టెన్‌గా మొత్తం 13 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 8 మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
కెప్టెన్‌గా బౌలింగ్ చేస్తూ 20.12 సగటుతో మొత్తం 50 వికెట్లు పడగొట్టాడు.
కమిన్స్ తన కెప్టెన్సీలో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై ఆడాడు.
ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి రెండు టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.
భారత పర్యటనకు ఆస్ట్రేలియా టెస్టు జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషగ్నే, నాథన్ లియోన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.
Pragyan Ojha on Rohit Sharma: కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ! అడిగితే ఎమోషనల్!
Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!