News
News
X

Jaydev Unadkat: జయదేవ్ ఉనద్కత్‌ను రెండో టెస్టు జట్టు నుంచి విడుదల చేసిన బీసీసీఐ - ఎందుకో తెలుసా?

భారత పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌‌ను రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

Jaydev Unadkat IND vs AUS: భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు ముందు జయదేవ్ ఉనద్కత్‌ను టీమిండియా విడుదల చేసింది.

నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టులో జయదేవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాదు. ఇప్పుడు అతనికి ఈ మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం లభించదు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున జయదేవ్ ఉనద్కత్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. సెమీ ఫైనల్లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటకను ఓడించింది.

దేశవాళీ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత జయదేవ్ ఉనద్కత్‌ను టీమ్ ఇండియాలో చేర్చారు. సౌరాష్ట్ర తరఫున అతను చాలా మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ కారణంగా అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగమయ్యాడు. కానీ ఉనద్కత్‌కు నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టులో ఆడే అవకాశం రాకపోవడంతో ఇప్పుడు రెండో టెస్టు కూడా ఆడలేడు.

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని విడుదల చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌరాష్ట్ర, బెంగాల్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 16వ తేదీన జరిగే ఈ మ్యాచ్‌లో అతను సౌరాష్ట్ర తరఫున ఆడనున్నాడు.

రంజీ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 527 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర ముందు 117 పరుగుల లక్ష్యం నిలిచింది. సౌరాష్ట్ర తరఫున అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ అర్పిత్ వాసవాడ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.

కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జట్టు తరఫున కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. మయాంక్ 429 బంతులు ఎదుర్కొని 249 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శ్రీనివాస్ 66 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో కూడా మయాంక్ 55 పరుగులు సాధించాడు. మరో బ్యాటర్ నికిన్ జోస్ సెంచరీ చేశాడు. అతను 109 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు.

సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 527 పరుగులు చేసింది. కెప్టెన్ అర్పిత్ వాసవాడ సౌరాష్ట్ర తరఫున డబుల్ సెంచరీ చేశాడు. అతను 406 బంతులు ఎదుర్కొని 202 పరుగులు చేశాడు. అర్పిత్ ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక మరో బ్యాటర్ షెల్డన్ జాక్సన్ కూడా సెంచరీ చేశాడు. 23 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేశాడు. ఇక చిరాగ్ జానీ 72 పరుగులు సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అర్పిత్ 47 పరుగులు చేశాడు. చేతన్ సకారియా 24 పరుగులు చేశాడు.

ఫిబ్రవరి 16వ తేదీన సౌరాష్ట్ర జట్టు బెంగాల్‌తో ఫైనల్ మ్యాచ్‌లో పోటీపడనుంది. తొలి సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను 306 పరుగుల తేడాతో ఓడించి బెంగాల్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ధృవ్ షోరే అత్యధికంగా 860 పరుగులు చేశాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ప్రశాంత్ చోప్రా ఐదు సెంచరీలతో ముందంజలో ఉన్నాడు. అయితే అత్యధిక పరుగులు చేసిన వారిలో ప్రశాంత్ చోప్రా ఐదో స్థానంలో ఉన్నాడు. అతను 783 పరుగులు సాధించాడు.

Published at : 12 Feb 2023 07:17 PM (IST) Tags: Team India India vs Australia jaydev unadkat

సంబంధిత కథనాలు

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

Kane Williamson Ruled Out: గాయపడే తిరిగొస్తివి! ఈ 'డైవ్‌'లు ఎందుకు కేన్ మామా - ఐపీఎల్‌ నుంచి ఔట్‌!

Kane Williamson Ruled Out: గాయపడే తిరిగొస్తివి! ఈ 'డైవ్‌'లు ఎందుకు కేన్ మామా - ఐపీఎల్‌ నుంచి ఔట్‌!

‘ఈ సాలా కప్ నహీ’ అంటున్న ఆర్సీబీ కెప్టెన్.. ఏంది బ్రో అంత మాటన్నావ్!

‘ఈ సాలా కప్ నహీ’ అంటున్న ఆర్సీబీ కెప్టెన్.. ఏంది బ్రో అంత మాటన్నావ్!

టాప్ స్టోరీస్

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్