T20 WC 2021, SA vs WI 1 Innings highlites: నిలిచారు గానీ.. దంచలేదు! సఫారీలకు విండీస్ టార్గెట్ 144
ఇంగ్లాండ్‌పై చెత్తగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఈసారి మెరుగ్గానే ఆడింది. సఫారీలకు ఫర్వాలేదనిపించే టార్గెట్ నిర్దేశించింది. ఎవిన్ లూయిస్ అర్ధశతకం చేశాడు.
![T20 WC 2021, SA vs WI 1 Innings highlites: నిలిచారు గానీ.. దంచలేదు! సఫారీలకు విండీస్ టార్గెట్ 144 ICC T20 WC 2021: WI vs SA West Indies given target 144 against South Africa Match 18 at Dubai International Stadium T20 WC 2021, SA vs WI 1 Innings highlites: నిలిచారు గానీ.. దంచలేదు! సఫారీలకు విండీస్ టార్గెట్ 144](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/dc40a4110a72fe52cd690efee10ae17b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో దుబాయ్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు 8 వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేసింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (56; 35 బంతుల్లో 3x4, 6x6) అర్ధశతకం చేశాడు. కీరన్ పొలార్డ్ (26; 20 బంతుల్లో 2x4,1x6) రాణించాడు. విధ్వంసకర విండీస్ బ్యాటర్లను సఫారీ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. సమయోచితంగా బంతులు వేసి బోల్తా కొట్టించారు. డ్వేన్ ప్రిటోరియస్ (3/17), కేశవ్ మహరాజ్ (2/24) బౌలింగ్‌లో రాణించారు. రబాడా, నార్జ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ పోరులో సఫారీలనే టాస్ వరించడంతో కరీబియన్లను మొదట బ్యాటింగ్‌కు పంపించారు. గత మ్యాచు చెత్త ప్రదర్శనను దృష్టిలో పెట్టుకున్న విండీస్ ఈసారి జాగ్రత్తగా ఆడింది. అనవసర షాట్లు ఆడకుండా ఓపెనర్లు లూయిస్, సిమన్స్ (16: 35 బంతుల్లో) ఓపిక పట్టారు. పది ఓవర్ల వరకు వికెట్టే ఇవ్వలేదు. దాంతో 73 పరుగుల భాగస్వామ్యం లభించింది. కుదురుకున్నాక లూయిస్ సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోయాడు. 10.3వ బంతికి అతడిని మహరాజ్ ఔట్ చేశాక విండీస్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. కాసేపు పొలార్డ్ అలరించినా.. ఆఖర్లో సఫారీలు కట్టుదిట్టంగా బంతులేసి కరీబియన్లను 143కే పరిమితం చేశారు.
End of the innings!
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
West Indies end up with a total of 143/8.
Which side will clinch their first victory of the tournament? #T20WorldCup | #SAvWI | https://t.co/q4Grni6krE pic.twitter.com/FyloGjySgC
Also Read: T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?
Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?
Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?
Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Rapid ⚡️
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
Nortje gets Russell with an absolute thunderbolt of a delivery. #T20WorldCup | #SAvWI | https://t.co/q4Grni6krE pic.twitter.com/osusGE4ana
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)